TG News : ఆసరా పింఛన్ల రికవరీ నోటీసులపై సీఎస్ కీలక ఆదేశాలు!
తెలంగాణలో సంక్షేమ పథకాల లబ్ధి పొందుతోన్న అనర్హులకు నోటీసులపై సీఎస్ శాంతకుమారి స్పందించారు. మార్గదర్శకాలు ఇచ్చే వరకు రికవరీ నోటీసులు ఇవ్వొద్దని అధికారులకు సూచించారు. అర్హులే లబ్ధి పొందేలా స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేస్తామని చెప్పారు.