Rahul Gandhi: తెలంగాణ కులగణన సర్వేపై రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ కులగణనపై లోక్‌సభలో రాహుల్‌గాంధీ మాట్లాడారు. తెలంగాణ జనాభాలో దాదాపు 90 శాతం జనాభా దళితులు, ఆదివాసీలు, వెనకబడిన వర్గాలు (BC), మైనార్టీలే ఉన్నారన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు.

New Update
Rahul Gandhi in Lok sabha

Rahul Gandhi in Lok sabha

తెలంగాణలో కుణగణన సర్వే పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ సర్వే రిపోర్టును రేవంత్‌ సర్కార్‌ మంగళవారం అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టింది.  అయితే ఈ అంశంపై సోమవారం జరిగిన లోక్‌సభలో కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. '' తెలంగాణలో మేము కులగణన సర్వే చేశాం. ఆ రిపోర్టు ఫలితాలు చూసి షాకయ్యాను. తెలంగాణ జనాభాలో దాదాపు 90 శాతం జనాభా దళితులు, ఆదివాసీలు, వెనకబడిన వర్గాలు (BC), మైనార్టీలే ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉంటుందని నాకర్థమయ్యింది. ఓబీసీ జనాభా దేశంలో దాదాపు 50 శాతానికి పైగానే ఉంటుంది ఉంటుంది. 

Also Read: మణిపూర్ అల్లర్ల వెనుక సీఎం బైరెన్ సింగ్ !.. సుప్రీంకోర్టు ఆదేశం

దేశ సంపదలో దళితులు, ఆదివాసీలు, వెనకబడిన వర్గాల నుంచే వస్తుంది. కానీ ఈ సామాజిక వర్గాలకు చెందినవాళ్లలో సొంతంగా వాళ్లకు ఎలాంటి పరిశ్రమలు లేవు. ప్రధాని మోదీకి మద్దతిచ్చే పెద్ద మీడియా సంస్థలు కూడా దళితులు, ఆదివాసీలు, ఓబీసీలకు చెందినవి కావు. దేశవ్యాప్తంగా కులగణన జరిగితే.. దేశంలో ఉన్న సంపద, అధికారం, సంస్థలు ఎవరి చేతుల్లో ఉన్నాయే బయటపడుతుంది. బీజేపీలో దళిత, ఆదివాసి, ఓబీసీ ఎంపీలు ఉన్నారు. దేశంలో 50 శాతం జనాభా ఉన్న ఓబీసీ ఎంపీలు పార్లమెంటులో ఏమీ మాట్లాడరని'' రాహుల్ గాంధీ అన్నారు. 

Also Read: కులగణన, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో రేవంత్ సంచలన ప్రకటన

 ఇదిలాఉండగా.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. మొత్తం 50 రోజుల పాటు ఈ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 1,03889 మంది అధికారులు పాల్గొన్నారు. 96.9 శాతం కుటుంబాలను సర్వే చేశారు. 3.54 కోట్ల మంది తమ ఈ సర్వేలో తమ వివరాలు వెల్లడించారు. 3.1 శాతం మంది సర్వేలో పాల్గొనలేదని కమిషన్ నివేదికలో తెలిపింది. ఫిబ్రవరి 5న మధ్యాహ్నం తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుందని'' ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 

కులగణన సర్వే ప్రకారం తెలంగాణలో సామాజిక వర్గాల వారి జనాభా శాతం

ఎస్సీలు - 17.43 శాతం
ఎస్టీలు -  10.45 శాతం
బీసీలు -  46.25
ముస్లిం మైనార్టీ బీసీలు - 10.08 శాతం
ముస్లిం మైనార్టీ సహా బీసీలు -  56.33 శాతం 
ముస్లిం మైనార్టీ ఓసీలు - 2.48 శాతం
మొత్తం ముస్లిం మైనార్టీ జనాభా - 12.56 శాతం
మొత్తం ఓసీలు - 15.79 శాతం 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు