/rtv/media/media_files/2025/02/04/wJtbaRZ9ONyOEOvi6yJK.jpg)
telangana cabinet 000 Photograph: (telangana cabinet 000)
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ దగ్గర పడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యంలో సబ్ కమిటీ ఇచ్చిన కులగణన నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏక సభ్య కమిషన్ అందజేసిన ఎస్సీ వర్గీకరణ నివేదికకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చేసిన ఈ రెండు నివేదికలపై తెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో చర్చించనున్నారు. వాటిపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు.
కులగణన, ఎస్సి వర్గీకరణ పై అసెంబ్లీ కమిటీ హాల్లో కీలక భేటి
— Shareef (@shareef_journo) February 4, 2025
సబ్ కమిటీ నుండి క్యాబినెట్ కు అందిన రెండు నివేదికల పై ఆమోదం తెలపనున్న మంత్రి వర్గం#cabinet #Telangana pic.twitter.com/0RUyu94fce
Also Read: Telangana: తెలంగాణ అఘోరీ అరెస్ట్.. కారుతో సహా గాల్లోకెత్తేసి.. అచ్చు అల్లు అర్జున్ జులాయి సినిమా సీన్ లాగానే!
కులగణన, ఎస్సీ వర్గీకరణలకు తెలంగాణ నుంచే రోడ్ మ్యాప్ ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలోనే తొలిసారి కులగణన చేసిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించిందని ఆయన ప్రకటించారు. కచ్చితమైన వివరాలతో పకడ్బందీగా సర్వే చేశామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కులగణన విషయంతో తమ నిర్ణయంతో ప్రధానిపై కూడా ఒత్తిడి పెరుగుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు.
Also Read : పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ షాక్....