BSF jawan : 80 గంటలు, 3 సమావేశాలు.. BSF జవాన్ ఎక్కడ.. పాక్ ఆర్మీ అతన్ని ఏం చేసింది?

భారత బిఎస్‌ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షా రిలీజ్ పై ఉత్కంఠ నెలకొంది. పాకిస్తాన్ విడుదల చేసిన కళ్లకు గంతలు కట్టిన పూర్ణం ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  గడిచిన 80  గంటల్లో పాక్ అధికారులతో చర్చలు జరిపిన అతడి అచూకీ తమకు కూడా తెలియడం లేదు.

New Update
bsf jawan purnam kumar shah

bsf jawan purnam kumar shah

ఏప్రిల్ 23న పంజాబ్‌లో విధి నిర్వహణలో ఉన్నప్పుడు అనుకోకుండా సరిహద్దు దాటి పాకిస్తాన్ కస్టడీలో ఉన్న భారత బిఎస్‌ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షా రిలీజ్ పై ఉత్కంఠ నెలకొంది. పాకిస్తాన్ విడుదల చేసిన కళ్లకు గంతలు కట్టిన పూర్ణం ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  గడిచిన 80  గంటల్లో పాక్ అధికారులతో చర్చలు జరిపిన అతడి అచూకీ తమకు కూడా తెలియడం లేదని అధికారులు అంటున్నారు.  . పాకిస్తాన్ రేంజర్స్‌తో మరోసారి ఫీల్డ్ కమాండర్ స్థాయి ఫ్లాగ్ మీటింగ్ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు.  

పూర్ణం కుమార్ షా భార్య గర్భవతి

మరోవైపు పూర్ణం కుమార్ షా భార్య రజని ప్రస్తుతం గర్భవతి.  ఆమె మీడియాతో  మాట్లాడుతూ..  "నేను ఇక్కడే కూర్చుని శాశ్వతంగా వేచి ఉండలేను. పూర్ణం ప్రతి సాయంత్రం నాకు ఫోన్ చేసి ఏమి జరిగిందో చెప్పేవాడు. కానీ 72 గంటలుగా అతని నుండి నాకు ఎటువంటి సమాచారం అందలేదు. నాకు అక్కడి నుంచి సహయం అందకపోతే, నేను ఢిల్లీకి వెళ్లి పిఎంఓ నుండి సమాధానాలు తీసుకుంటాను. అవసరమైతే నా భర్త విడుదల కోసం నేను ప్రధానమంత్రి,రాష్ట్రపతిని కూడా  సంప్రదిస్తాను. " అని రజని చెప్పారు. రజని చివరిగా మంగళవారం తన భర్త పూర్ణంతో మాట్లాడారు. పూర్ణం తల్లి దేవంతి దేవి కూడా తన బాధను వ్యక్తం చేస్తూ, "నా కొడుకు తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను. అతని నుండి నాకు  సమాచారం అంది చాలా సమయం అయింది" అని దేవంతి అన్నారు.

పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీకి చెందిన పూర్ణం కుమార్ షా (40) బుధవారం రైతులకు భద్రత కల్పిస్తూ పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దును ప్రమాదవశాత్తు దాటడంతో పాకిస్తాన్ రేంజర్లు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బంధువుల ప్రకారం పూర్ణం కుమార్ షా  దంపతుల రెండవ బిడ్డతో గర్భవతి. ఈ దంపతులకు ఏడేళ్ల పాప ఉంది. అతను 17 సంవత్సరాలుగా దేశానికి సేవ చేస్తున్నాడు. కాగా జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన తరువాత భారత్, పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు తెగిపోయాయి.  

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

KAVERI JET ENGINE: రక్షణరంగంలో ఇండియా మరో అద్భుతం

DRDO స్వతహాగా రూపొందించిన కావేరీ ఇంజిన్‌ ఇన్‌ ఫ్లైట్ టెస్టింగ్‌కు అనుమతి పొందింది. అయితే స్వదేశంలో ఈ టెస్ట్ చేయడానికి వసతులు లేకపోవడంతో రష్యాలో టెస్ట్ చేయనున్నారు. ఈ ఇంజిన్‌ విజయవంతమైతే.. విమానాలు రాడార్‌లు సైతం గుర్తించలేని స్పీడ్‌తో దూసుకెళ్లగలవు.

New Update
KAVERI JET ENGINE

ఇండియా శాస్త్రవేత్తలు రక్షణ రంగంలో మరో ఘనత సాధించారు. DRDO కావేరీ ఇంజిన్‌ను స్వతహాగా రూపొందించింది. కావేరీ ఇంజిన్ ఇన్‌ ఫ్లైట్ టెస్టింగ్‌కు అనుమతి పొందింది. అయితే స్వదేశంలో ఈ టెస్ట్ చేయడానికి వసతులు లేకపోవడంతో రష్యాలో టెస్ట్ చేయనున్నారు. రష్యాలో కావేరీ ఇంజిన్‌కు టెస్ట్‌కు ఏర్పాటు చేస్తున్నారు. కావేరీ ఇంజిన్ జెట్ ఇంజిన్‌ దేశీయంగా తయారు చేయడంలో ఇది కీలక అడుగు మారనుంది.

ఇప్పటివరకూ రష్యా, అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్ దగ్గరే జెట్ ఇంజిన్ తయారీ టెక్నాలజీ ఉంది. ఈ ఇంజిన్లను UCAV ఘాటక్ విమానాల్లో అమర్చేందుకు ఇండియన్ సైంటిస్టులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఇంజిన్‌ విజయవంతమైతే.. విమానాలు రాడార్‌లు సైతం గుర్తించలేని స్పీడ్‌తో దూసుకెళ్లగలవు. దీంతో రక్షణ రంగంలో భారత్‌ గొప్పశక్తిగా ఎదగగలదు.

Kaveri engine | russia | latest-telugu-news | india pak war | india defence | latest telugu movie releases

Advertisment
Advertisment