/rtv/media/media_files/2025/11/19/hidma-mother-2025-11-19-12-28-48.jpg)
Hidma: కేవలం 17 ఏళ్ల వయసులోనే ఉద్యమంలో చేరి, అత్యంత క్రూరమైన దాడులకు సారథ్యం వహించి, దేశంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులలో ఒకరిగా నిలిచిన హిడ్మా శకం ఇక ముగిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మంగళవారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లోనే(Encounter) హిడ్మాతో పాటుగా అతని భార్య రాజే అలియాస్ రాజక్క కూడా మృతి చెందింది. హిడ్మా ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా, పుజారి కాన్కేల్ గ్రామ సమీపంలోని పెసాపల్లి గ్రామంలో జన్మించాడు.
Also Read: పుట్టపర్తి ఆధ్యాత్మిక భూమి.. బాబా జీవితం వసుదైక కుటుంబం..
దండకారణ్యం ప్రాంతంలోని ముసాయిపల్లి గ్రామంలో ఒక పేద గిరిజన కుటుంబంలో జన్మించాడు. అతడికి చిన్నప్పటి నుంచి ఎలాంటి చదువు లేదు. బాల్యంలోనే మావోయిస్ట్ భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. 1990ల చివరిలో కేవలం 17 ఏళ్ల వయసులోనే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA)లో ఒక సాధారణ సభ్యుడిగా చేరాడు. చురుకుదనం, క్రూరత్వం, మెరుపుదాడుల వ్యూహాల కారణంగా హిడ్మా చాలా తక్కువ సమయంలోనే మావోయిస్ట్ శ్రేణులలో అత్యంత కీలక స్థానాలకు చేరుకున్నాడు. హిడ్మాను పట్టుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. రూ. 45 లక్షల వరకు రివార్డు ప్రకటించాయి.
Also Read: శబరిమలలో ఏపీ భక్తులపై అమానుషం! ..ప్యాంట్ జిప్ విప్పి
సాధారణంగా మావోయిస్టులు భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయంటే ఆ ప్రాంతాలను ఖాళీ చేసి అజ్ఞాతంలోకి వెళ్లడం సర్వసాధారణం. కానీ హిడ్మా శైలి పూర్తిగా భిన్నం. హిడ్మా తాను ఉన్న అటవీ ప్రాంతం గురించి భద్రతా బలగాలకు స్వయంగా లీకులు పంపించేవాడు. ఆ సమాచారం నమ్మి బలగాలు అక్కడికి చేరుకునే క్రమంలోనే మాటువేసి, అత్యంత భీకరంగా ఊచకోతలు కోసేవాడు. దంతేవాడ (2010), బీజాపూర్ (2011), జీరామ్ లోయ (2013), బీజాపూర్-సుకుమా ఏరియా దాడులు (2021) వంటి అనేక భారీ దాడులు హిడ్మా ఈ వ్యూహంలో భాగమేనని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
కూంబింగ్ ఆపరేషన్‌లో ఉన్న బలగాలను దారి మళ్లించి, వారికి తనే సేఫ్ అడ్డాను చూపించి, వారు చేరుకునే క్రమంలో బాంబులు, ఐఈడీలు, విల్లంబులతో విరుచుకుపడేవాడు. ఈ వ్యూహాల కారణంగానే హిడ్మా ఉన్నాడనే సమాచారం వస్తే, భద్రతా బలగాలు ఒకటికి పది సార్లు తనిఖీ చేసుకున్నాకే ఆ దిశగా కదిలేవి. 2023 జనవరిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో బెటాలియన్ 1లోని 11 మంది హతమైనా, దాడికి కొద్ది నిమిషాల ముందే హిడ్మా తప్పించుకున్నట్లు తర్వాత బలగాలు గుర్తించాయి. ఈ పరిణామాలు అతని పోరాట పటిమకు, తెలివైన వ్యూహాలకు నిదర్శనంగా నిలిచాయి.
Also Read: తన వాళ్ల కోసమే బ్రతికే మగ మహానుభావులందరికి హ్యాపీ మెన్స్ డే!!
హిడ్మా మరణం తర్వాత అతని కుటుంబ చరిత్ర విషాదభరితంగా ముగిసింది. దశాబ్దాలుగా సాయుధ పోరాటంలో కొనసాగిన ఆ కుటుంబ సభ్యులంతా ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోగా, ప్రస్తుతం హిడ్మా తల్లి మాత్రమే పూవర్తి గ్రామంలో ఒంటరిగా మిగిలారు. హిడ్మా కుటుంబం చిన్నప్పుడు సుకుమాలోని పూవర్తి గ్రామంలో నివాసం ఉండేది. తల్లి పోడియం ముయే, హిడ్మా, అతడి ఇద్దరు అన్నలు, ఒక అక్కతో కూడిన ఆ కుటుంబం పేదరికంలో జీవనం సాగించేది. తండ్రి హిడ్మా చిన్నగా ఉన్నప్పుడే చనిపోయాడు.
Also Read: ఏపీలో సంచలనం.. సిటీల్లోకి మావోయిస్టులు..పట్టణాలు, నగరాల్లో ప్రత్యేక షెల్టర్లు
మావోయిస్టు దళాలకు రాజకీయ పాఠాలు
ఆ రోజుల్లో పీపుల్స్ వార్ పార్టీ గ్రామాల్లో జననాట్య మండలి ద్వారా సభలు, సమావేశాలు నిర్వహించేది. ఈ ప్రదర్శనలకు ఆకర్షితులైన హిడ్మా సోదరులు తొలుత మావోయిస్ట్ పార్టీ వైపు అడుగులు వేశారు. ఆ తర్వాత హిడ్మా కూడా ఉద్యమంలో చేరి కీలక నేతగా ఎదిగాడు. 2008 సంవత్సరంలో హిడ్మా అక్క మరణించింది. 2015లో హిడ్మా అన్న ఒక ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. తన అన్న మృతికి గుర్తుగా హిడ్మా పూవర్తి గ్రామంలో ఒక భారీ స్థూపాన్ని నిర్మించాడు. అయితే, ఆ తర్వాత గ్రామంలో క్యాంప్ ఏర్పాటు చేసిన భద్రతా బలగాలు ఆ స్థూపాన్ని కూల్చివేశాయి. ప్రస్తుతం, హిడ్మా తల్లి పోడియం ముయే మాత్రమే పూవర్తి గ్రామంలో ఒంటరిగా జీవిస్తున్నారు. తాజాగా హిడ్మాతో పాటు అతని భార్య కూడా ఎన్‌కౌంటర్‌లో చనిపోవడంతో కుటుంబం మొత్తం సాయుధ పోరాటంలో అసువులు బాసినట్టయింది. హిడ్మా భార్య రాజే మావోయిస్టు దళాలకు రాజకీయ పాఠాలు బోధించడంలో కీలక పాత్ర పోషించారు.
Follow Us