Uttam Kumar Reddy and Bhatti Vikramarka In Delhi | ఆ శాఖలు మాకే | Telangana Cabinet | Rahul | RTV
తెలంగాణలో సీఎం మార్పు జరుగబోతున్నట్లు బీజేపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్వీఎస్ఎస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 9 తర్వాత కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం కాబోతున్నట్లు జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారంటూ చెప్పుకొచ్చారు.
SC వర్గీకరణ అసెంబ్లీలో ప్రవేశపెడుతుండగా CM రేవంత్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. 20ఏళ్లు రాజకీయ జీవితంలో ఆత్మసంతృప్తి కలిగించిన రోజు ఇదే అన్నారు. 3 దశాబ్దాల పోరాటానికి SC వర్గీకరణ పరిష్కారం. ఇలాంటి అవకాశం తనకు రావడం సంతోషంగా ఉందని CM రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణలో పెట్టుబడుల పంట పండనుంది. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా అమెజాన్‌తో తెలంగాణ ప్రభుత్వం రూ.60 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ తమ డేటా సెంటర్లను విస్తరించాలని ప్లాన్ చేస్తోంది.
మొదటిసారి ఓటు వేస్తున్న వారు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సలహా ఇస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దేశ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి మరీ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఆప్కీ అదాలత్‌లో దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్. ఈనెల చివరిలోగా అర్హులైన మహిళలకు మహాలక్ష్మీ స్కీం కింద రూ. 2500సాయం అందించేందుకు సర్కార్ రెడీ అయ్యింది. లోకసభ ఎన్నికల కోడ్ వచ్చేలోపే ఈ స్కీం అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ డీఎస్పీ నళిని కలిశారు. ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సాధన కోసం నళిని తన డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమబాట పట్టిన విషయం తెలిసిందే.
ఓ మహిళకు సాయం చేసిన అంశంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. పదేళ్లు దోచుకున్న లక్ష కోట్ల ఆస్తిలోంచి.. రూ. 1 లక్ష మాత్రమే సాయం చేశారని వ్యాఖ్యానించారు. దోచుకున్న సంపదనంతా కరిగిస్తామని అన్నారు.
ప్రజా దర్బార్ పేరును మార్చుతూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ప్రజావాణిగా మార్చాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ఇక మీదట వారం మొత్తం కాకుండా ప్రతి మంగళ, శుక్రవారాల్లో మాత్రమే జనాల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.