Revanth Reddy: అందెశ్రీకి పద్మశ్రీ.. పాఠ్యాంశంగా 'జయజయహే తెలంగాణ'.. సీఎం రేవంత్ కీలక ప్రకటనలు!

ప్రముఖ రచయిత అందెశ్రీ అంతిమయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఘట్‌కేసర్‌లోని అందెశ్రీ అంతిమయాత్రలో రేవంత్ రెడ్డి పాడె మోశారు. ఓ కళాకారుడిగా, రచయితగా ఆయన ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

New Update
ande sri

ప్రముఖ రచయిత అందెశ్రీ అంతిమయాత్ర(Ande sri death)లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు. ఘట్‌కేసర్‌లోని అందెశ్రీ అంతిమయాత్రలో రేవంత్ రెడ్డి పాడె మోశారు. ఓ కళాకారుడిగా, రచయితగా ఆయన ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పశువుల కాపరిగా, తాపీ మేస్త్రిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా రాష్ట్ర సాధనలో అందెశ్రీ గొప్ప పాత్ర పోషించారని అన్నారు. వారిని కోల్పోవడం తెలంగాణ సమాజంతో పాటు వ్యక్తిగతంగా నాకు తీరని లోటుని ముఖ్యమంత్రి భావోద్వేగానికి లోనయ్యారు. 

Also Read :  అందెశ్రీ పాడె మోసిన సీఎం రేవంత్.. అక్షర యోధుడికి కన్నీటి నివాళి!

Revanth Reddy Attends The Funeral Of Writer Andesri

గద్దర్ అన్నతో పాటు అందెశ్రీ కూడా ప్రజల్లో స్పూర్తి నింపారని చెప్పుకొచ్చారు. ఆయన రాసిన ప్రతీ పాట తెలంగాణలో స్ఫూర్తిని నింపింది. అందుకే ఆయన రాసిన “జయ జయహే తెలంగాణ” గీతాన్ని పాఠ్యాంశంగా చేర్చేందుకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయన పేరుతో ఓ స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆయన పాటల సంకలనం “నిప్పుల వాగు” ఒక భగవద్గీతగా, బైబిల్‌గా, ఖురాన్‌గా తెలంగాణ సమస్యలపై పోరాడేవారికి గైడ్‌గా ఉపయోగపడుతుందని చెప్పారు.

అందుకే 20 వేల పుస్తకాలను ముద్రించి తెలంగాణలోని ప్రతీ లైబ్రరీలో “నిప్పుల వాగు”ను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని గత ఏడాది కేంద్రానికి లేఖ రాశామన్నారు. ఈ సంవత్సరం కూడా కేంద్రానికి లేఖ రాస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. వారికి పద్మశ్రీ గౌరవం దక్కేలా కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి సహకరించాలని కోరారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలుగా వారిని పద్మశ్రీతో గౌరవించుకునేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. 

Also Read :  కోడ్ ఉల్లంఘించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కేసులు

Advertisment
తాజా కథనాలు