/rtv/media/media_files/2025/11/11/ande-sri-2025-11-11-13-41-48.jpg)
Ande sri
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ సోమవారం మృతి చెందడంతో నేడు అంత్యక్రియలు చేపట్టారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అంత్యక్రియలకు హాజరయ్యారు. లాలాపేట్ నుంచి ఘట్‌కేసర్ వరకు అంతిమయాత్ర కొనసాగించి ఎన్ఎఫ్‌సీ నగర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సమయంలో రేవంత్ రెడ్డి అందెశ్రీకి ఘన నివాళులర్పించి పాడె మోశారు. తనకు అందెశ్రీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం రేవంత్ తెలిపారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. వారికి అండగా ఉంటానని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. అలాగే అందెశ్రీ అంత్యక్రియలకు కేటాయించిన ప్లేస్‌లో స్మృతి వనం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చూడండి: Ande Sri : గొర్ల కాపరి నుంచి కవి వరకు.. అనాథ నుంచి డాక్టర్ రేట్ వరకు... అందెశ్రీ ప్రయాణం ఇదే!
అందెశ్రీ పాడె మోసిన సీఎం రేవంత్.. ఆత్మీయ కవికి కన్నీటి వీడ్కోలు!@revanth_anumula#RevanthReddy#tribute#poet#writer#andesri#RTVpic.twitter.com/wUmgjOkOJ5
— RTV (@RTVnewsnetwork) November 11, 2025
ఇది కూడా చూడండి: Ande Sri : నెల రోజులు టాబ్లెట్స్ వేసుకోలే.. అందెశ్రీకి 5 ఏళ్లుగా హైపర్ టెన్షన్.. గాంధీ ఆసుపత్రి డాక్టర్ సంచలన విషయాలు!
Follow Us