ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయనకు నోటీసులు పంపిన అధికారులు ఆదివారం సాయంత్రం విచారించారు. కేసీఆర్ సిట్ విచారణను ఎదుర్కోవడంపై బీఆర్‌ఎస్ శ్రేణులు రేవంత్ సర్కార్‌పై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఉద్యమకారుడిని అవమానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ అంశంపై సీఎం రేవంత్ స్పందించారు. చేసిన తప్పులకు అధికారులు నోటీసులు పంపిస్తే తెలంగాణ సమాజానికి నోటీసులు ఇచ్చినట్లు ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు.
సోమవారం రావి నారాయణరెడ్డి జాతీయ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ''ఉద్యమకారుడిని అవమానిస్తారా అంటూ అల్లర్లు చేస్తున్నారు. ఉద్యమకారులు అనే పదాలను వాళ్లే రాసుకుంటున్నారు. నిజమైన తెలంగాణ జాతిపిత దేనికి ఆదర్శం. కోదండరామ్ తెలంగాణ ఉద్యమకారుడు కాదా?. ఆయన ఉద్యమాలు చేయలేదా?. మరి ఆయన్ని ఎందుకు అరెస్టు చేశారు.
Also Read: జేఈఈ మెయిన్స్ తుది పరీక్షల షెడ్యూల్ విడుదల
గత బీఆర్‌ఎస్ పాలనలో ఉద్యమకారులను అవమానించలేదా ?. మీ ఇంటి తలుపులను ఎవరూ బద్దలుకొట్టలేదు. మిమ్మల్ని ఈడ్చుకెళ్లలేదు. రాష్ట్రంలో ఉన్న పదవులన్నీ తీసుకున్నారు. భూములను పంచుకున్నారు. కాంట్రాక్టులు పంచుకొని తప్పులు చేశారు. తప్పులు చేస్తే విచారణ ఎదుర్కోవడం తప్పదు. తప్పులు చేసినందకు మాత్రమే ఇక్కడ నోటీసులు ఇచ్చారు. శిబూ సోరేన్, జయలలిత, యడియూరప్ప లాంటి వాళ్లు విచారణ ఎదుర్కోలేదా?. రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్లు తెలంగాణ కోసం తమ సర్వం కోల్పోయారు.
Also Read: ఈయూ ప్రతినిధి సంచలన ప్రకటన.. యూరప్ సైన్యం ఏర్పాటు ప్రమాదకరమని హెచ్చరిక
అక్రమ మార్గం ఎంచుకున్న వాళ్లు ప్రజాస్వామ్యంలో విచారణను ఎదుర్కోవాల్సిందేనని అంబేద్కర్ ఎప్పుడో చెప్పారంటూ'' రేవంత్ అన్నారు. మరోవైపు బీజేపీ ప్రభుత్వ విధానాలను కూడా సీఎం రేవంత్ విమర్శించారు. రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును కాలరాసేందుకే SIRను తీసుకొచ్చారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చేందుకే బీజేపీ ఎన్నికల్లో 400 సీట్లు అడిగిందన్నారు. కానీ మెజార్టీ సీట్లు కూడా గెలవలేకపోయిందని ఎద్దేవా చేశారు. రాజ్యాంగంపై దాడి జరుగుతోందని ఆరోపించారు. మనమందరం ప్రజల్లో చైతన్యం నింపాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
CM Revanth: కేసీఆర్ సిట్ విచారణపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ అంశంపై సీఎం రేవంత్ స్పందించారు. చేసిన తప్పులకు అధికారులు నోటీసులు పంపిస్తే తెలంగాణ సమాజానికి నోటీసులు ఇచ్చినట్లు ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు.
CM Revanth