JEE Mains final : జేఈఈ మెయిన్స్ తుది పరీక్షల షెడ్యూల్ విడుదల

దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో బీటెక్/ బీఆర్క్ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్ - 2025 తుది విడత పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు జరగనున్నాయి. దీనికి సంబంధించి పరీక్షల షెడ్యూళ్లను  నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ రోజు (సోమవారం) విడుదల చేసింది.

New Update
FotoJet (26)

EE Main 2025 Phase 2 Exam Dates Announced

JEE Mains final : దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో బీటెక్/ బీఆర్క్ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్ - 2025 తుది విడత పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు జరగనున్నాయి. దీనికి సంబంధించి పరీక్షల షెడ్యూళ్లను  నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ రోజు (సోమవారం) విడుదల చేసింది. కాగా ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in లో ధరఖాస్తు చేసుకోవాలని సూచించింది.తుది విడత పరీక్షలకు సంబంధించి సెషన్-2 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఇప్పటికే ప్రారంభమైంది. దీనికి చివరి తేదీగా ఫిబ్రవరి 25 ప్రకటించారు. ఆ రోజున రాత్రి 9 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుందని ఎన్‌టీఏ తెలిపింది. అదే రోజున రాత్రి 11:50 గంటల వరకు ఆన్‌లైన్ పేమెంట్ చేసేందుకు అవకాశం కల్పించింది. ఫీజు చెల్లించకుండా అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిచేసే అవకాశం లేదని స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా ఏప్రిల్ 2 నుండి ఏప్రిల్ 9 వరకు నిర్వహించే జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 పరీక్ష ప్రతిరోజూ రెండు షిఫ్టులలో నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక షిప్టు, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిప్టు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను తెలుగు, ఇంగ్లీష్ సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.ఒకే పేపర్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు దరఖాస్తు రుసుము కేటగిరీని బట్టి మారుతుంది. అందులో  జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ. 1,000 ఫీజూ చెల్లించాలి. జనరల్EWS, OBC-NCL వర్గాలకు చెందిన పురుష అభ్యర్థులతో అన్ని వర్గాల మహిళా అభ్యర్థులు రూ. 800 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, PwD, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు మాత్రం రూ. 500 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

 కాగా  జేఈఈ మెయిన్ 2026 కి నిర్దేశించిన అర్హత ప్రమాణాల ప్రకారం.. గత మూడు సంవత్సరాలలో 12వ తరగతి లేదా తత్సమాన అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే, పరీక్షకు హాజరు కావడానికి ఎలాంటి గరిష్ట వయోపరిమితి లేదు. జేఈఈ మెయిన్ పరీక్షలో రెండు వేర్వేరు పేపర్లు ఉంటాయి. బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్ 1 పరీక్ష రాయాల్సి ఉంటుంది. బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సులలో ప్రవేశాల కోసం పేపర్ 2 రాయాల్సి ఉంటుంది.

జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 కోసం దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, సెషన్ II కోసం రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, అభ్యర్థులు తమ వివరాలను ఉపయోగించి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితమైన వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసిన తర్వాత దరఖాస్తు రుసుము చెల్లించాలి. అప్లికేషన్ సబ్‌మిట్ చేసిన తరువాత అభ్యర్థులు అప్లికేషన్ ఫారమ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 కి సంబంధించిన అడ్మిట్ కార్డ్‌లు, పరీక్షా కేంద్రం, నగరం వంటి సమాచారం, ఇతర ముఖ్యమైన అప్‌డేట్‌ల కోసం అభ్యర్థులు అధికారిక NTA JEE వెబ్‌సైట్‌‌ను చెక్ చేసుకోవాల్సి ఉంటుందని ఎన్‌టీఏ వివరించింది.

Advertisment
తాజా కథనాలు