TG: ఒకొక్కరుగా వస్తారో, అందరూ కలిసి వస్తారో రండి: సీఎం రేవంత్ సవాల్ రైతు రుమాఫీ, బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతుంటే బీఆర్ఎస్ గుండెల్లో పిడుగులు పడుతున్నాయని సీఎం రేవంత్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఒకొక్కరుగా వస్తారో, అందరూ కలిసి వస్తారో రండి. అసెంబ్లీలో చర్చిద్దామని సవాల్ విసిరారు. By srinivas 30 Nov 2024 | నవీకరించబడింది పై 30 Nov 2024 21:27 IST in తెలంగాణ మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి Revanth Reddy : 2023 నవంబర్ 30కి దేశ రాజకీయాల్లోనే ఒక గొప్ప ప్రాధాన్యత ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పోలింగ్ బూత్ లలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఈ రోజుకు ఏడాది పూర్తయిందని చెప్పారు. రైతు బిడ్డగా కొండారెడ్డి నుంచి బయలుదేరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చానంటూ మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్ రైతు పండుగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు రేవంత్ మాట్లాడుతూ.. తనకు ముఖ్యమంత్రి పదవి ఆశామాషీగా వచ్చింది కాదన్నారు. ఇది ఒక బాధ్యత. బీఆరెస్, బీజేపీ నాయకులు ఎలాంటి విమర్శలు చేస్తున్నారో మీరు గమనించండి. పదేళ్లలో వాళ్ళు ఏం చేశారో నాకంటే మీకే ఎక్కువ తెలుసంటూ ప్రజలను ఉద్ధేశిస్తూ భావోద్వేగ ప్రసంగం చేశారు. ఇది కూడా చూడండి: రైతు బంధు బంద్.. హరీష్ రావు ఫైర్! బీఆరెస్ గుండెల్లో పిడుగులు.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రైతు రుణమాఫీ జరిగిందా? రైతుకు గిట్టుబాటు ధర లభించిందా? వరి వేస్తే ఉరే అని చెప్పిన ఆనాటి పెద్దమనిషి కేసీఆర్. కానీ ఈనాడు వరి ధాన్యానికి బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ అవుతుంటే, బీఆరెస్ గుండెల్లో పిడుగులు పడుతున్నట్లుంది. కాళేశ్వరం లేకపోయినా, చుక్క నీరు రాకపోయినా కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల ద్వారా నీళ్లిచ్చి 66లక్షల ఎకరాల్లో 1 కోటి 50లక్షల వరి ధాన్యం తెలంగాణ రైతులు పండించారు. వరికి బోనస్ అందించి గర్వంగా పాలమూరు గడ్డపై రైతు పండుగ చేసుకుంటున్నామన్నారు. ఇది కూడా చూడండి: చెన్నై ఎయిర్‌పోర్టు మూసివేత.. ఎందుకో తెలుసా ? రైతు సంక్షేమం కాంగ్రెస్ పేటెంట్.. ఆనాడు ఔటర్ రింగ్ రోడ్ ను రూ.7500 కోట్లకు తెగనమ్మి ఐదేళ్లలో వాళ్లు రుణమాఫీకి ఖర్చు చేసింది11వేల కోట్లే అని చెప్పారు. ఈ 11 వేల కోట్లలో రూ. 8596 కోట్లు మిత్తికే పోయినయ్. రైతులకు మీరు చెల్లించింది కేవలం రూ.2500 కోట్లే. మిస్టర్ హరీష్ రావు ఇది విను.. లెక్కలు కావాలంటే మళ్లీ చెబుతాం. కేసీఆర్ కు ఈ వేదికగా సవాల్ విసురుతున్నా. 25రోజుల్లో రూ.17,869 కోట్లు రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలో ఎక్కడైనా ఉందా నిరూపించండి. మోదీ వస్తారో.. కేసీఆర్ వస్తారో రండి చర్చిద్దామని సవాల్ విసిరారు. ఇక మొదటి ఏడాదిలోనే 25 లక్షల మంది రైతులకు రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం తమదని చెప్పారు. ఒకొక్కరుగా వస్తారో, అందరూ కలిసి వస్తారో రండి. అసెంబ్లీలో చర్చిద్దాం. రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మాది. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన చరిత్ర మాది.. రైతు బీమా తెచ్చింది కాంగ్రెస్.. వరి పంటకు రూ.500 బోనస్ ఇచ్చింది కాంగ్రెస్.. రైతు సంక్షేమం కాంగ్రెస్ పేటెంట్. కేసీఆర్ పాలమూరు బిడ్డలు నిన్ను పల్లకిలో మోస్తే మా గుండెలపై తన్ని వలసలు పెరిగేలా చేసింది నువ్వు కాదా? అంటూ ద్వజమెత్తారు. ఆనాడు పాలమూరును దత్తత తీసుకుంటా అని కేసీఆర్ అన్నాడు. కానీ పదేళ్ల ఆయన పాలనలో జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. ఇవాళ మేం నారాయణ్ పేట్ -కొడంగల్ ప్రాజెక్టు పూర్తి చేస్తామంటే మాత్రం కాళ్లల్లో కట్టెలు పెడుతుండు. పాలమూరుకు నీళ్లు తెస్తామంటే కేసీఆర్, ఆయన కొడుకు, అల్లుడు అడ్డు పడుతున్నారు. ఎవడో వచ్చి పాలమూరును దత్తత తీసుకోవడంకాదు.. మీ పాలమూరు బిడ్డనే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎవరి దయా దాక్షిణ్యాలు మాకు అవసరం లేదు. మనకు వచ్చిన ఈ అవకాశాన్ని జారవిడుచుకుందామా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మనం పూర్తి చేసుకోవద్దా? ఓకే సంతకంతో మన జిల్లాకు కావాల్సిన అన్ని తెచ్చుకుందాం. ఏడాదికొక రూ. 20వేల కోట్లు మా జిల్లాకు ఇవ్వాలని మీ తరపున మా మంత్రి వర్గాన్ని నేను అడుగుతా అన్నారు. ఐదేళ్లలో లక్ష కోట్లు ఈ జిల్లాకు తెచ్చకుంటే బంజరు భూములు బంగారు భూములుగా మారవా? కేసీఆర్ కమీషన్ల కక్కుర్తి కోసం కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు తీసుకెళ్లిండు. అలాంటిది మన గడ్డ అభివృద్ధికి లక్ష కోట్లు తెచుకోలేమా. మిత్రులారా.. వాళ్ల సోయిలో పడి మోసపోవద్దు. నా ప్రాంత అభివృద్ధి కోసం, ఇక్కడి యువత కోసం కొడంగల్ లో పారిశ్రామిక వాడ నిర్మించాలనుకుంటే.. లగచర్ల చిచ్చు పెట్టి అమాయక లంబాడాలను జైల్లో పెట్టించిండ్రు. వాళ్ల మాయమాటలు నమ్మి అమాయక లంబాడాలు జైలుకు పోయిండ్రు. నేను ఆనాడే చెప్పిన వాళ్ల మాయ మాటలు నమ్మొద్దని. ఒక్క కేసీఆర్ కే గజ్వేల్ లో వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. మా పారిశ్రామిక వాడ కోసం 1300 ఎకరాలు ఉండొద్దా అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: MH: ఆరోజునే మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారం.. ఆనాడు అధికారులపై దాడులు చేసి ఉంటే నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు పూర్తయ్యేవాఅభివృద్ధి జరగాలంటే కొందరు నష్టపోక తప్పదన్నారు. వారికి కావాల్సిన నష్టపరిహారం ప్రభుత్వం అందిస్తుంది. వాళ్లకు ఫామ్ హౌస్ లు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు వస్తారు.. పోతారు.. కానీ మన ప్రాంతానికి పరిశ్రమలు మళ్లీ వస్తాయా? ఇంట్లో ఒకరికి ఉద్యోగం వస్తే ఒక తరం పరిస్థితే మారుతుంది. అలాంటి అవకాశం మీరు కోల్పోవద్దు. కేసీఆర్ నీ మొసలి కన్నీరు పాలమూరు జిల్లాపై కాదు. నేను ఇక్కడ పుట్టినోన్ని.. ఇక్కడి మట్టిలో కలిసే వాణ్ణి.. ఈ ప్రాంతంపై నాకంటే ఎక్కువ ప్రేమ ఎవరికి ఉంటుందన్నారు. ఇది కూడా చదవండి: నీటి వాటాలో వీసమెత్తు నష్టం వాటిల్లొద్దు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు! పారిశ్రామిక వాడ తెచ్చి 25 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే జిమ్మేదారి నాది. మీ కుట్రలు, కుతంత్రాలకు నేను బెదిరేవాణ్ణి కాదు. తోడేళ్ళు, పులులు ఎన్నో చూశా. మానవ మృగాలు మీరెంత. పని చేయడమే మనకు తెలుసు. పనిలోపడి చేసింది చెప్పుకోలేకపోతున్నాం. మాకు ఏ బ్రాండ్ అంబాసిడర్లు అవసరం లేదు.. మీరే మా బ్రాండ్ అంబాసిడర్స్. ఒక్కొక్క యువకుడు ఒక రేవంత్ రెడ్డిగా మారి అభివృద్ధిని ప్రజలకు చేర్చండి. నేను మీవాణ్ణి.. నన్ను ఆశీర్వదించండి. కుట్రలను కుతంత్రాలను తిప్పి కొట్టండి. పాలమూరులో 20 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చే బాధ్యత నాదంటూ కీలక హామీ చేశారు. #telangana #brs #bjp #CM Revanth #mahabubnagar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి