/rtv/media/media_files/2025/11/05/cm-revanth-and-kishan-reddy-campaign-in-jubilee-hills-by-polls-2025-11-05-20-52-43.jpg)
CM Revanth and Kishan Reddy Campaign in Jubilee hills by polls
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార, విపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని సీఎం రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ గెలుపుకోసం బీజేపీ మద్దుతు ఇస్తోందని విమర్శించారు.రాష్ట్రాన్ని దోసుకున్న కేసీఆర్, కేటీఆర్‌ను అరెస్టు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కేటీఆర్ తనకు సవాల్ విసురుతున్నారని, నిజంగా తాను నిలుచుంటే సవాల్ విసిరిన కేటీఆర్ పారిపోతాడంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే జూబ్లీహిల్స్‌లో 4 వేల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.
Also Read: షాకింగ్ వీడియో: నదిలో భక్తుల పడవ బోల్తా.. అరుపులు కేకలతో గందరగోళం
మరోవైపు బీజేపీ నేత కిషన్ రెడ్డి కూడా జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను తీవ్రంగా విమర్శించారు. ''పదేళ్లపాటు తెలంగాణ కేసీఆర్ కుటుంబం పాలయ్యింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రం వచ్చాయి. పేదలకు డబుల్ బెడ్‌రూమ్‌లు ఇవ్వలేదు. వాళ్లు మాత్రం ఫాంహౌస్‌లు కట్టుకున్నారు. కాంగ్రెస్ పాలన కూడా అలానే ఉంది. కేసీఆర్ పోయి రేవంత్ వచ్చారు తప్పు అవినీతి మారలేదు. రేవంత్ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు. తులం బంగారం, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు గురించి అడిగితే ఫ్రీ బస్సు అంటున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు నెలకు రూ.2500 సంగతేంటని'' కిషన్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.
Also Read: మరో దారుణం.. మహిళల హాస్టల్ టాయిలెట్‌లో స్పై కెమెరాలు
Follow Us