Reavnth Reddy: బిగ్ షాక్.. సర్పంచ్‌ ఎన్నికలకు బ్రేక్‌

సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ నెల 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేమని చెప్పారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించి ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కోరుతామన్నారు.

New Update
CM Revanth

CM Revanth

సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంచలన ప్రకటన చేశారు. ఈ నెల 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు(local-body-elections) నిర్వహించలేమని చెప్పారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేసిన సీఎం.. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించి ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కోరుతామన్నారు. కోర్టు తీర్పు ప్రకారం ముందుకు వెళ్తామన్నారు సీఎం రేవంత్, కాగా సెప్టెంబర్  30లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే సీఎం తాజా కామెంట్స్ తో ఇప్పట్లో సర్పంచ్ ఎన్నికలు లేవని తెలుస్తోంది.  

Also Read :  మైనార్టీలకు రేవంత్ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 1.50 లక్షలు

Also Read :  సుమన్ హీరోగా మంత్రి పొంగులేటి బయోపిక్.. సినిమాలో ఆ సీన్లే హైలైట్?

సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్

ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదు కదా అని సీఎం అన్నారు. ఇవాళ కూడా తాను చాలామందికి కండువాలు కప్పానని,  కప్పిన కండువాలో ఏముందో వారికే తెలియదన్నారు. ఎవరింటికైనా వెళ్తే ఏ భోజనం పెడతారో ఎలా తెలుస్తుందని సీఎం ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల వేతనాల నుంచి రూ.5 వేలు ఇప్పటికే బీఆర్ఎస్ కు అన్నారు సీఎం రేవంత్. ఇవన్నీ టెక్నికల్ గా చూసుకుంటే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో వారికే తెలియాలని సీఎం తెలిపారు. బీఆర్ఎస్ కు 37 మంది ఎమ్మెల్యేల బలం ఉందని అసెంబ్లీ వేదికగా హరీష్ రావు చెప్పారని రేవంత్ అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతను స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. 

Advertisment
తాజా కథనాలు