/rtv/media/media_files/2025/07/08/child-kidnapped-in-shamshabad-2025-07-08-16-13-59.jpg)
Child kidnapped in Shamshabad.
హైదరాబాద్ నగర శివారు శంషాబాద్‌లోని ఒక కల్లు కాంపౌండ్ వద్ద ఆరేళ్ల బాలికను గుర్తు తెలియని మహిళ కిడ్నాప్ చేసింది. ఈ సంఘటన జూలై 1న జరిగినప్పటికీ, సోమవారం రాత్రి మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read : పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ.. అసీమ్ మునీర్ తిరుగుబాటు
Child Kidnapped In Shamshabad
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మహబూబ్ నగర్‌కు చెందిన భవన నిర్మాణ కార్మికురాలు లక్ష్మమ్మ (30) తన ఇద్దరు పిల్లలైన కీర్తన (6), కె అర్చన (3) తో కలిసి స్థానిక కల్లు కాంపౌండ్‌కు వచ్చింది. ఆమె కల్లు తాగుతుండగా, గుర్తు తెలియని మధ్య వయస్కురాలైన ఒక మహిళ కూడా కల్లు కాంపౌండ్‌కు వచ్చి లక్ష్మమ్మ దగ్గర కూర్చుని మాట్లాడటం ప్రారంభించింది. ఆమె ఇద్దరు పిల్లలతోనూ మాటలు కలిపి వారిని దగ్గరికి తీసుకుంది. వారికి కూడా కల్లు తాగించింది.
Also Read : రేవంత్ రెడ్డికి చర్చ చేయడం రాదు.. అందుకే ఢిల్లీకి పారిపోయిండు..కేటీఆర్ కీలకవ్యాఖ్యలు
ఈ లోపు లక్ష్మమ్మ తాగి మత్తులోకి జారుకోవడం గమనించిన మహిళ కీర్తనను మాటలతో మభ్యపెట్టి తనతో తీసుకెళ్లింది. లక్ష్మమ్మ మత్తు నుంచి తేరుకున్నాక తన కూతురు లేదని గుర్తించింది. అనంతరం శుక్రవారం రాత్రి పోలీసులను ఆశ్రయించింది. తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read : స్టార్ హీరో ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్.. ఫ్యాన్స్ జాగ్రత్తమ్మా!
ఆర్జీఐఏ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సేకరించగా, ఆ మహిళ కల్లు కాంపౌండ్ ప్రాంగణం నుండి బయటకు నడుచుకుంటూ వెళ్తున్నట్లు గుర్తించారు. అధికారులు సంఘటనా స్థలానికి సమీపంలో, దానికి ఎదురుగా ఉన్న రోడ్లపై ఉన్న ఇతర నిఘా కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఆమెను పట్టుకుని, వీలైనంత త్వరగా బిడ్డను రక్షిస్తామని పోలీసులు వెల్లడించారు.
Also Read: Elon Musk : ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ ఎత్తుగడ..పార్టీలో భారతీయుడికి కీలక పదవి
child-kidnapped | kidnapping-children | kidnapping | samshabad