Clash Over Love Marriage: కూతురు లవ్‌ మ్యారేజ్‌...యువకుడి ఇంటికి నిప్పు పెట్టిన తండ్రీకొడుకులు..

కూతురు తన ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకుందని ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కూతురు లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేని కుటుంబసభ్యులు అబ్బాయి ఫ్యామిలీపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఇంటికి నిప్పుపెట్టారు.

New Update
FotoJet - 2025-11-04T122005.509

Clash Over Love Marriage: కూతురు తన ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకుందని ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కూతురు లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేని కుటుంబసభ్యులు అబ్బాయి ఫ్యామిలీపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఇంటికి నిప్పుపెట్టారు. ఈ  ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఎస్ఐ పాటిల్​క్రాంతికుమార్​కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఝరాసంగం మండలం కక్కర్ వాడ గ్రామానికి చెందిన గొల్ల విఠల్​కూతురు అదే గ్రామానికి చెందిన బోయిని నగేశ్ ను కొద్దిరోజుల కింద  ప్రేమ పెండ్లి చేసుకుంది. 

తమ ప్రేమ విషయం తండ్రికి చెప్పినప్పటికీ ఆయన ఒప్పుకోలేదు.ఈ నేపథ్యంలోనే యువతి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంది. ఈ విషయం ఆమె తండ్రి గొల్ల విఠల్‌కు తెలియడంతో అతడు ఆగ్రహంతో ఊగిపోయాడు. .కుమారుడు పాండుతో కలిసి నగేష్ తండ్రి పై ఇద్దరూ కలిసి విచక్షణా రహితంగా దాడి చేశారు. అనంతరం ఇంటికి నిప్పుపెట్టారు. విషయం గమనించిన స్థానికులు వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఇంటి దగ్గరకు చేరుకున్నారు. మంటల్ని ఆర్పేశారు. ఈ సంఘటనపై నగేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రీకొడుకులపై కేసు పెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read :  టీమిండియా జట్టులో నో ప్లేస్.. కానీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఎంట్రీ.. కట్ చేస్తే మ్యాచ్ ఆఫ్ ది ప్లేయర్

Advertisment
తాజా కథనాలు