Kaleshwaram Case: కేసీఆర్ పై కేసు.. పిటిషనర్ హత్య

భూపాలపల్జి జిల్లా కేంద్రంలో నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై కేసీఆర్, మాజీ మంత్రులతో పాటు గుత్తేదారు కంపెనీలపై రాజలింగమూర్తి కేసు నమోదు చేసి వెలుగులోకి వచ్చాడు.

New Update
murder

murder

Kaleshwaram Case: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి 15వ వార్డు కౌన్సిలర్ భర్త నాగవెల్లి రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు పట్టణంలోని రెడ్డి కాలనీలో అదును చూసి కత్తులతో విచక్షణారహితంగా పొడవడంతో రాజలింగమూర్తి కుప్పకూలిపోయాడు. కొద్దిసేపు మృత్యువుతో పోరాడి తనువు చాలించాడు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Also Read: Lavanya: ఓవైపు రాజ్ ని ప్రేమిస్తూనే మస్తాన్ సాయితో బెడ్ రూమ్ లో.. లావణ్య గురించి ఫ్రెండ్ ప్రీతీ..

భూపాలపల్జి జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీ వద్ద నాగవెల్లి రాజలింగమూర్తి అనేపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడిన బాధితుడు ఆ తర్వాత మృతి చెందాడు. కాగా  కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై కేసీఆర్, మాజీ మంత్రులతో పాటు సదరు గుత్తేదారు కంపెనీలపై రాజలింగమూర్తి కేసు నమోదు చేసి వెలుగులోకి వచ్చాడు.

కాగా రాజలింగమూర్తి హత్య రాజకీయ హత్యనా లేకా మరేదైనా కారణాలతోనా అనేది తెలియాల్సి ఉంది. పాతకక్షలు, భూ తగాదాలే హత్యకు ప్రధాన కారణమని స్థానికులు అంటున్నారు.  వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: సీఎం సంచలన నిర్ణయం.. అవినీతికి పాల్పడ్డ 52 మంది పోలీసులు సస్పెండ్

ఫిబ్రవరి 20న విచారణ..

కాళేశ్వరం నీటి పారుదల ప్రాజెక్టులో అవకతవకాలకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు(KCR), మాజీ మంత్రి టీ. హరిశ్ రావు(Harish Rao) ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ భూపాల్‌పల్లి జిల్లా కోర్టులో గతంలో పిటిషన్ దాఖలైంది. భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి ఈ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణను కొనసాగించే స్టే ను తెలంగాణ హైకోర్టు పొడిగించింది. ఈ అంశంపై ఫిబ్రవరి 20న విచారణ చేపట్టనున్నట్లు చెప్పింది. రేపు విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ హత్య జరగడం కలకలం రేపింది.

Also Read:  భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు!

జస్టిస్ కె. లక్ష్మణ్, కేసీఆర్ ,ఇతరులు తమపై నోటీసులు జారీ చేసిన జిల్లా కోర్టు పరిధిని ప్రశ్నిస్తూ వేసిన  పిటిషన్‌పై స్పందిస్తూ, జూలై 2022లో అజాద్ ఎన్‌కౌంటర్ కేసులో తన తీర్పునకు సంకేతంగా, క్రిమినల్ రివిజన్ పిటిషన్లపై తేలికగా నిర్ణయం తీసుకోవాలనేది తన స్పష్టమైన అభిప్రాయమని తెలిపారు.ఈ కేసు 2023 అక్టోబర్ 25న భూపాల్‌పల్లి పోలీసు స్టేషన్‌లో నాగవెల్లి రాజలింగ మూర్తి దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో, కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 1.35 లక్షల కోట్ల ప్రజాధనం అవినీతికి గురైనట్లు ఆరోపణలు చేస్తూ కేసీఆర్ , ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు.

Also Read: Rishab Shetty: ఫ్యాన్స్ కి గూస్ బంప్స్.. ఛత్రపతి శివాజీ మహారాజ్ గా రిషబ్ శెట్టి.. పోస్టర్ వైరల్

పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో, లింగమూర్తి స్థానిక మెజిస్ట్రేట్ కోర్టును సంప్రదించి పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కానీ, ఇది ప్రత్యేకంగా న్యాయస్థానం కావడం వల్ల కోర్టు దీనిని తిరస్కరించింది,  అంతేకాక, మూర్తి భూపాల్‌పల్లి జిల్లా కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు కేసీఆర్ఇతరులకు నోటీసులు జారీ చేసింది. ఈ జిల్లా కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని కేసీఆర్, ఇతరులు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. కాగా రేపు కేసు విచారణకు రానుంది.

Also Read: J&K: కాశ్మీర్ లో కరువు తప్పదేమో..వాతావరణశాఖ

Also Read :  మహా కుంభమేళాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్నానం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు