/rtv/media/media_files/2025/02/19/eeBH2ixS45PreN01qSpe.jpg)
Chhatrapati shivaji
Chhatrapati Shivaji: 'కాంతారా' ఫేమ్ హీరో రిషబ్ శెట్టి బాలీవుడ్ ఎంట్రీ సిద్ధమైంది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న 'ఛత్రపతి శివాజీ మహారాజ్' చిత్రంలో నటించనున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నేడు శివాజీ మహారాజ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి ఛత్రపతి శివాజీగా రిషబ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. జై భవానీ! జై శివాజీ! హర్ హర్ మహాదేవ్!! గొప్ప యోధుడు రాజు #ThePride Of Bharat #ChhatrapatiShivajiMaharaj 395వ జయంతి సందర్భంగా.. సగర్వంగా మూవీ ఫస్ట్ లుక్‌ను అందిస్తున్నాము అంటూ ట్వీట్ చేశారు.
RISHAB SHETTY IN & AS 'CHHATRAPATI SHIVAJI MAHARAJ': BRAND NEW POSTER UNVEILS... On the birth anniversary of #ChhatrapatiShivajiMaharaj, #SandeepSingh and #RishabShetty unveil the #NewPoster of #ThePrideOfBharat: #ChhatrapatiShivajiMaharaj.
— taran adarsh (@taran_adarsh) February 19, 2025
The film stars #RishabShetty as… pic.twitter.com/5FnR8Tz0Dk
Also Read: YS Jagan: వంశీ చాలా అందగాడు.. అందుకే చంద్రబాబుకు కోపం: జగన్!
2027లో మూవీ..
ఈ చిత్రం 2027 జనవరి 21న హిందీతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ బయోపిక్ ను డైరెక్టర్ సందీప్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో హీరో రిషబ్ శివాజీ పాత్ర గురించి మాట్లాడుతూ.. బయోపిక్ లాంటి అవకాశాలు జీవితంలో ఒక్కసారే వస్తాయి. ఒక నటుడిగా ఆయన కథను పెద్ద తెరపైకి తీసుకురావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను అని తెలిపారు.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రోషన్ బ్లాక్ బస్టర్ 'కాంతారా' ప్రీక్వెల్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దీంతో పాటు 'హనుమాన్' సీక్వెల్ కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. 'కాంతారా' 2025 అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: chhaava: అదిరిపోయింది గురూ.. చావా సినిమా చూడటానికి ఏకంగా గుర్రంపై వచ్చి.. వీడియో వైరల్
Also Read : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు!