AP: మహా కుంభమేళాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్నానం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మహాకుంభమేళా లో పుణ్యస్నానం చేశారు. ఆయన తన భార్య, కుమారుడు అకిరాతో కలిసి ఆయన ఈరోజు ప్రయాగ్ రాజ్ ను సందర్శించారు.  వీరితో పాటూ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అక్కడికి వెళ్ళారు. 

author-image
By Manogna alamuru
New Update
prayag

Deputy CM Pawan Kalyan Visited Maha kumbhamela

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు దేశంలో ఉన్న ప్రముఖులు, రాజకీయ నేతలు వరుసగా తరలి వెళుతున్నారు. రాష్ట్రపతి, ప్రధాని మోధీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మినిస్టర్ లోకేశ్ లు ఇప్పటికే కుంభమేళాకు వెళ్ళి అక్కడ పుణ్యస్నానాలు ఆచరించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ప్రయాగ్ రాజ్ వెళ్ళారు. అక్కడ పవిత్ర సంగమంలో స్నానం చేసి మహా హారతి ఇచ్చారు. పవన్ కల్యాణ్ తో పాటూ ఆయన భార్య, కుమారుడు అకీరా, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లు కూడా ఇందులో పాల్గొన్నారు. 

 

Also Read: BIG BREAKING: పెద్దగట్టు జాతరలో తొక్కిసలాట

మనది ఐకమత్య దేశం..

మహాకుంభమేళా జరుగుతున్న తీరుపై, అక్కడ ఏర్పాట్లపై పవన్ కల్యాణ్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ చాలా బాగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. మనదేశంలో వివిధ భాషలున్నాయి, అనేక సంస్కృతులున్నాయి కానీ మనందరం ఐకమత్యంగా ఉన్నాము, అదే మన గొప్పతనం అంటూ డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు. 

 

 

Also Read: TS: మరో ఐదు జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల ప్రకటన

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు