ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. యువతి కళ్లు పీకేసి, కాలు విరగొట్టి కిరాతకంగా..

ఉత్తరప్రదేశ్‌లో 22 ఏళ్ల దళిత యువతిని అతి కిరాతకంగా చంపిన ఘటన చోటుచేసుకుంది. ఆమె కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా ఇంతలో మృతదేహం గ్రామ కాలువలో లభ్యమైంది. కాలు విరగొట్టి, కళ్లు పీకేసి అతి కిరాతకంగా ఆమెను చంపారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

New Update
uttar

uttar Photograph: (uttar)

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య గ్రామ సమీపంలోని నిర్జన కాలువలో 22 ఏళ్ల దళిత యువతి మృతదేహం శనివారం లభ్యమైంది. ఆమె శరీరంపై లోతైన గాయాలు ఉండటంతో పాటు కళ్లు కూడా కనిపించకుండా ఉన్నాయి. దీంతో ఆమెను హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శరీరానికి తాడులు కట్టి ఉండటంతో పాటు శరీరంపై ఎక్కువగా కత్తి కోతలు ఉన్నాయి.

ఇది కూడా చూడండి: CM Chandrababu: ఇలాంటి బావమరిది దొరకడం నా అదృష్టం.. చంద్రబాబు ఎమోషనల్!

ఇది కూడా చూడండి: Jayalalitha: జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికే...సీబీఐ స్పెషల్‌ కోర్టు తీర్పు!

కాలు విరగొట్టి అతి కిరాతకంగా..

ఆమె కాలు కూడా విరగొట్టారు. చాలా భయంకరంగా ఆమెను హత్య చేశారు. ఈ మృత దేహాన్ని చూసిన ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మూర్చపోయారు. అయితే యువతి కనిపించడం లేదని శుక్రవారం ఫిర్యాదు అందిందని, ఇంతలోనే శవం కనిపించింది. పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. 

ఇది కూడా చూడండి: RC16: 20 ఏళ్ళు వెనక్కి వెళ్లి.. RC16 షూటింగ్ కోసం బుచ్చిబాబు పెద్ద ప్లానింగ్!

ఇదిలా ఉండగా ఆ దళిత బాలికకు న్యాయం జరగకపోతే రాజీనామా చేస్తానని సమాజ్ వాద్ పార్టీ ఎంపీ అవదేశ్ ప్రసాద్ అన్నారు. ఆ యువతికి ఇలా జరగడం బాధాకరమన్నారు. ఆమెకు తప్పకుండా న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. దీంతో అయోధ్య ప్రజలు అవదేశ్‌ను మెచ్చుకుంటున్నారు. ప్రతీ ప్రాంతానికి ఇలాంటి నాయకుడు తప్పకుండా కావాలని అంటున్నారు.  

ఇది కూడా చూడండి: AP Crime: కొడుకును నెత్తురు కక్కేలా కొట్టిన తండ్రి.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు