/rtv/media/media_files/2025/12/07/brs-working-president-ktr-shared-interesting-pic-of-kcr-2025-12-07-18-52-24.jpg)
Brs Working President Ktr Shared interesting pic of Kcr
బీఆర్‌ఎస్(brs) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr) తన ఎక్స్ ఖాతాలో ఆసక్తిరక పోస్ట్ చేశారు. తన తండ్రి, పార్టీ చీఫ్ కేసీఆర్(kcr)కు సంబంధించి ఓ ఫొటోను షేర్ చేశారు. అందులో కేసీఆర్ గులాబీ కండువాతో ఓ కుర్చిలో కూర్చున్నారు. ఆయన కాళ్ల కింద ఓ శుకనం ఉంది. ఈ ఫొటోకు కేటీఆర్ 'IYKYK' అనే క్యాప్షన్ ఇచ్చారు. అయితే దీనికి అర్థం 'If You Know, You Know'. తెలిసినవాళ్ల వాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనే అర్థాన్ని ఈ క్యాప్షన్ సూచిస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది.
IYKYK pic.twitter.com/qvFnKG48Tn
— KTR (@KTRBRS) December 7, 2025
Also Read: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్దం..
KTR Shared Interesting Pic Of KCR
ప్రస్తుతం తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి తరుణంలో కేటీఆర్ తన ఎక్స్‌లో కేసీఆర్ ఫొటో షేర్ చేయడం చర్చనీయం అవుతోంది. నెటిజన్లు విభిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇదిలాఉండగా డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా విజయ్ దివస్ వేడుకలు నిర్వహించాలని కేటీఆర్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలో కూడా సంబరాలు చేయాలని సూచించారు.
Also Read: మైనర్ బాలికపై అత్యాచారం.. న్యూజిలాండ్‌లో భారతీయుడిగా జైలుశిక్ష
తెలంగాణ ఉద్యమ సమయంలో 2009, నవంబర్ 29న నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 9న కేసీఆర్ దీక్ష ఫలించింది. ఆరోజున ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే ఆరోజును రాష్ట్రవ్యాప్తంగా విజయ్ దివస్ పేరుతో పండుగలా జరపుకోవాలని కేటీఆర్ కోరారు.
Follow Us