KTR: దమ్ముంటే అలా చేయి.. రేవంత్ కు కేటీఆర్ సవాల్!

లగచర్ల అంశాన్ని వదిలిపెట్టమని.. అసెంబ్లీ నడిచే అన్ని రోజులు ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉంటామని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే కనీసం 15 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలన్నారు. కొడంగల్‌లో భూ సేకరణ కేవలం రేవంత్ అల్లుడి కోసమని ఆరోపించారు.

New Update
BRS KTR

రేవంత్ రెడ్డికి దమ్ముంటే కనీసం 15 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ భవన్‌లో కొడంగల్ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని రైతన్నలు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు, గురుకుల పాఠశాలల సమస్యల నుంచి మొదలుకొని అన్ని వర్గాల సమస్యలపై, అలాగే ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై చర్చ పెట్టాలన్నారు. ప్రజా సమస్యలపై చర్చించిన తర్వాత, రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న స్కాములపై, ఫార్ములా-ఈ వంటి అంశాలపై కూడా చర్చకు మేము సిద్ధమేనన్నారు. కేబినెట్ మీటింగ్ పేరుతో గంటల తరబడి ఎవరిని అరెస్ట్ చేయాలో చర్చించడం పాలన కాదన్నారు. పాలన అంటే ప్రజల కోసం చర్చించడమే అని చెప్పారు.
ఇది కూడా చదవండి: ఇండియా కూటమికి షాక్.. సీఎం ఫడ్నవీస్‌ను కలిసిన ఉద్ధవ్ ఠాక్రే

నరేందర్ రెడ్డి ఉక్కు మనిషి..

కొడంగల్ ప్రజల కోసం నిలబడ్డ మా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఉక్కు మనిషిగా మారి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భవిష్యత్తులో తుక్కు తుక్కు చేస్తాడన్నారు. భవిష్యత్తులో లగచర్ల నుంచే జైత్రయాత్ర ప్రారంభమవుతుందని.. రేవంత్ రెడ్డి పతనం మొదలవుతుందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి నక్క వినయాలు ప్రదర్శించి, అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాడన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ నుంచి మొదలుకొని అన్ని హామీలను తుంగలో తొక్కాడని విమర్శించారు.  
ఇది కూడా చదవండి: నేను కేటీఆర్ ను కలవలేదు.. అదంతా అసత్య ప్రచారం: మాధురి

రైతు రుణమాఫీ ఇప్పటి వరకూ 100% పూర్తవలేదని ఫైర్ అయ్యారు. లగచర్ల భూములు గుంజుకోవడమే రేవంత్ రెడ్డి కుటుంబ లక్ష్యంగా మారిందన్నారు. అందుకే ఫార్మా విలేజ్ ప్రాజెక్టును రద్దు చేసి, కొత్త నాటకాలు చేస్తున్నారన్నారు. తిరుపతి రెడ్డి అనే వ్యక్తి కనీసం వార్డు మెంబర్ కూడా కాదని.. కానీ పోలీసులు అండతో అరాచకాలు చేస్తున్నారన్నారు. కొడంగల్‌లో సేకరించిన భూములు పరిశ్రమల కోసం కాదు, కేవలం అల్లుడి కోసమని ఆరోపించారు. లగచర్ల అంశాన్ని వదిలిపెట్టమని.. అసెంబ్లీ నడిచే అన్ని రోజులు ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉంటామన్నారు. లగచర్ల రైతులను, పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలని పోలీసులు చూడాలన్నారు. 

ఇది కూడా చదవండి: జమిలి ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు