నేను కేటీఆర్ ను కలవలేదు.. అదంతా అసత్య ప్రచారం: మాధురి

తాను కేటీఆర్‌ను ఎప్పుడూ కలవలేదని దివ్వెల మాధురి క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తమన్నారు. ఈ మేరకు ఆర్టీవీతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ వార్త పోస్ట్ చేసిన వారిపై చట్టపరంగా వెళ్తానని తెలిపారు. బెల్లంకొండా సురేష్ ఎవరో తెలీదన్నారు.

New Update

కేటీఆర్‌ను పార్క్ హయత్ హోటల్‌లో కలిసారని వస్తున్న వార్తలపై దివ్వెల మాధురి స్పందించారు. కేటీఆర్‌ను కలిసారన్న వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చారు. మాధురి రెండు మూడుసార్లు కేటీఆర్‌ను కలిసారని మీడియా చిట్ చాట్‌లో చెప్పుకొచ్చినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. బెల్లంకొండా సురేష్ ద్వారా కేటీఆర్‌ను పార్క్ హయత్‌ హోటల్‌లో కలిసారని పేర్కొన్నట్లు ఒక క్లిప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. కేటీఆర్‌కు పెద్ద పొలిటిషన్ అనే గర్వం ఉండదని.. ఆయన చాలా సరదాగా, జాలీగా ఉంటారని ఆమె తెలిపినట్లు ఆ క్లిప్‌లో ఉంది.

 రాజకీయాల్లో పెద్ద స్థాయికి వెళ్లాలంటే ఎలా పనిచేయాలో కేటీఆర్ ఓపిగ్గా చెప్పేవారని ఆమె తెలిపినట్లు అందులో పేర్కొన్నారు. దువ్వాడ శ్రీనివాస్ కూడా కేటీఆర్ పొలిటికల్ లైఫ్ చూసి రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటారని మాధురి తెలిపినట్లు వైరల్ అయిన ఆ పేపర్ క్లిప్‌లో రాసి ఉంది.

ఇది కూడా చూడండి: తానుపారిపోవాలని అనుకోలేదు.. మొదటిసారి స్పందించిన అసద్

కేటీఆర్ ఎవరో తెలీదు

బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోయాక కేటీఆర్‌తో తనకు కాస్త గ్యాప్ వచ్చిందని.. ఆయనను కలవడం లేదని మాధురి తెలిపినట్లు అందులో ఉంది. అందుకు సంబంధించిన క్లిప్ వైరల్ కావడంతో మాధురి రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు RTVతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. తనకు బెల్లంకొండ సురేష్ అంటే ఎవరో తెలీదని క్లారిటీ ఇచ్చారు. అసలు ఈ వార్తలు ఎందుకు పుట్టుకొస్తున్నాయో తెలీదని అన్నారు. 

ఈ వార్త చూడగానే తాను కూడా షాక్ అయినట్లు తెలిపారు. ఎవరైతే ఈ వార్త పోస్ట్ చేశారో.. వారు పక్కాగా ఆధారాలు ఉంటే ఇలాంటివి స్ప్రెడ్ చేయాలని అన్నారు. ఆధారాలు లేకుండా ఇలాంటి తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. 

ఇది కూడా చూడండి: నా రికార్డ్‌లు కావాలంటే గూగుల్‌లో వెతకండి– బుమ్రా

కేటీఆర్‌కి ఈ విషయం చెప్పాలి

తానెప్పుడూ కేటీఆర్‌ను కలవలేదని.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదని తెలిపారు. అసలు ఆయన్ను కలవాలని కూడా ఎప్పుడూ అనుకోలేదన్నారు. ఇలాంటి రూమర్స్ ఎందుకు క్రియేట్ చేసి సర్క్యూలేట్ చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు. దీనిపై కేటీఆర్ కూడా స్పందించి.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తాను కేటీఆర్‌ను కలిసి చెప్పాలని ఉందని ఆమె చెప్పారు. ఒకవేళ కలవలేకపోయినా.. ఆయనకు కాల్ చేసి అయినా ఈ విషయం చెప్పాలనుందని ఆమె తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు