BRS : ఎమ్మెల్సీ బరిలో బీఆర్ఎస్ రెండో అభ్యర్థి?...వారికి చెక్ పెట్టేందుకే....

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎంపికపై బీఆర్‌ఎస్‌ కసరత్తు చేస్తోంది. బీఆర్‌ఎస్‌కు ఒకే స్థానం దక్కనుంది. కానీ రెండో స్థానానికి క్యాండిడేట్‌ను ప్రకటిస్తే.. ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై  చర్చిస్తోంది. బీఆర్‌ఎస్‌ గత ఎన్నికల్లో 38 స్థానాల్లో విజయం సాధించింది.

New Update
MLC candidates

MLC candidates

BRS : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎంపికపై బీఆర్‌ఎస్‌ కసరత్తు చేస్తోంది. బీఆర్‌ఎస్‌కు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య దృష్ట్యా ఒకే స్థానం దక్కనుంది. కానీ రెండో స్థానానికి క్యాండిడేట్‌ను ప్రకటిస్తే.. ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై  చర్చిస్తోంది. బీఆర్‌ఎస్‌ గత ఎన్నికల్లో 38 స్థానాల్లో విజయం సాధించింది. అయితే అందులో పదిమింది కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో  పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరకాటంలోకి పెట్టడానికి బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందుకోసం పార్టీ శ్రేణులతో సుదీర్ఘంగా చర్చిస్తోంది. రెండో అభ్యర్థిని నిలబెడితే లాభమా? నష్టమా అన్న దానిపై బేరీజు వేసుకుంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపటితో నామినేషన్ల గడువు ముగయనున్నది. ఐదు స్థానాలకు ఐదుగురు కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉంటే ఎన్నికల పోరు ఖాయమని మరో ప్రచారం సాగుతోంది.

ఇది కూడా చూడండి: Trolls on Jr NTR: ఎన్టీఆర్ యాడ్ పై గోరంగా ట్రోలింగ్‌..! వీడియో చూశారా?
 
ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని సంపాదించాలంటే 21 ఎమ్మెల్యేలు అవసరం. దీనిలెక్కన చూసుకుంటే మరో నలుగురు ఎమ్మెల్యేలు తమకు అవసరమని బీఆర్ఎస్ లెక్కలు కడుతోంది. రెండో అభ్యర్థిని నిలబెడితే...పార్టీ సింబల్​ద్వారా గెలిచిన వారందరికీ విప్​ జారీ చేయవచ్చునని బీఆర్‌ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్‌లో చేరిన​ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాము బీఆర్‌ఎస్‌ పార్టీనేనని చెప్పుకుంటున్నారు. పార్టీ మారిన వారిపై బీఆర్‌ఎస్‌ సుప్రీం కోర్టుకు వెళ్లగా ఆ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. అయితే తమ పదవులు పోతాయన్న భయంతో బీఆర్‌ఎస్‌ అసంతృప్తులు తాము ఇంకా బీఆర్‌ఎస్‌ నే నని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో  వారి వైఖరిని బయటపెట్టేందుకు..వారిపై మరింత ఒత్తిడి పెంచడానికి బీఆర్ఎస్ పెద్దలు ఎత్తుగడలు వేస్తున్నారు. ఒకవేళ తాము విసిరిన విప్‌ను స్వీకరించకుంటే ..దానిని అస్త్రంగా తీసుకొని సుప్రీంకోర్టులో ఫిరాయింపుల కేసు వేసే ఆలోచనతో గులాబీ పార్టీ ఉంది. అయితే రెండో అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలన్న దానిపై కారు పార్టీ సుదీర్ఘ చర్చలు సాగిస్తోంది.

Also Read: పెళ్లి చేసుకోకుండా శ్మశానవాటికలోనే.. ఈమెకు బతుకున్న మనుషులంటే భయమట!

కాగా ఇప్పటకే ఎమ్మెల్సీగా ఉండి  పదవి కాలం ముగిసిన సత్యవత్‌ రాథోడ్‌తో పాటు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, దాసోజు శ్రవణ్‌ల పేర్లను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు. ఇక మొత్తం 38 మంది ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేసి వారిని తమకు అనుకూలంగా ఓటు వేయించుకోవాలని చూస్తోంది. అదే సమయంలో బీఆర్‌ఎస్‌లో మిగిలిన ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురైతే పరిస్థితి ఏమిటన్న దానిపై కూడా కారు పార్టీ విశ్లేషిస్తోంది. ఏది‌ఏమైనా..రెండో స్థానానికి పోటీ చేయాలా లేదా అన్న అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ నేడు తేల్చే అవకాశం ఉంది.

Also Read: మగాళ్లను మర్డర్ చేసే అవకాశం ఇవ్వండి.. రాష్ట్రపతికి మహిళా నేత సంచలన లేఖ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు