/rtv/media/media_files/2025/02/20/x0f6l3UFUWw57wMoCx5j.jpg)
Ex MLA Gandra Venkata Ramana Reddy
BRS vs Congress: రాజలింగమూర్తి హత్య కేసు(Rajalingamurthy Murder Case) తెలంగాణలో దుమారం రేపుతోంది. ఈ హత్యను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి(Ex MLA Gandra Venkata Ramana Reddy) ఖండించారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. ''మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) ఈ హత్యపై చేసిన కామెంట్స్ బాధాకారం. ఏ ఆధారంతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పాలి. రాజలింగమూర్తి హత్యకు భూ వివాదాలే కారణం. ఈ కేసుతో నాకు, పార్టీ సంబంధం లేదు. ఎలాంటి విచారణకు అయిన నేను సిద్ధమే.
Also Read:ఇంత పిరికోడివి ఏంట్రా.. ప్రేమ, పెళ్లన్నాడు.. నుదుటిపై బొట్టు పెట్టి పారిపోయాడు!
నిందితులకు శిక్ష పడాల్సిందే..!
హత్య చేసిన నిందితులకు శిక్ష పడాల్సిందే. బీఆర్ఎస్ హత్య రాజకీయాలను చేయదు, ప్రొత్సహించదు. ఏదైనా మేము చట్ట ప్రకారమే వెళ్తామని'' గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. అయితే రాజలింగమూర్తి హత్య జరిగిన తర్వాత.. ఆయన భార్య గండ్ర వెంకట రమణారెడ్డిపై ఫిర్యాదు చేశారు. గతంలో ఆమె బీఆర్‌ఎస్ నుంచి కౌన్సిలర్‌గా కూడా గెలిచారు.
Also Read:14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?
ఇదిలాఉండగా.. రాజలింగమూర్తి హత్య ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఈ హత్య వెనుక కేసఆర్, కేటీఆర్, హరీశ్ రావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కారకులంటూ ఆరోపించారు. బీఆర్‌ఎస్ చేసిన దోపిడిని ప్రశ్నించినందుకే రాజలింగను హత్య చేశారని అన్నారు. ఆయన కూతరు, భార్య ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా విచారణ చేపడతామని పేర్కొన్నారు. అలాగే ఈ ఘటనపై సీఐడీ విచారణ జరగాలని.. 24 గంటల్లోనే నిందితులను అరెస్టు చేయాలన్నారు. తెలంగాణలో హత్య రాజకీయాలకు తావు లేదని.. అవినీతిపై పోరాటం చేసే వారికి రక్షణ కల్పిస్తామని అన్నారు. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై గండ్ర వెంకటరమణారెడ్డి స్పందించారు.
Also Read: కుంభమేళాలో జాగ్రత్త.. మల కోలిఫాం బ్యాక్టీరియా ఎంత డేంజరస్ అంటే..!
Also Read:BIG BREAKING: వల్లభనేని వంశీకి మరో ఎదురు దెబ్బ.. హైకోర్టు బిగ్ షాక్!