MLC kavitha VS KTR: కేటీఆర్ కడుపు నిండా కుట్రలే.. ఆయన నాయకత్వం అట్టర్ ఫ్లాప్.. కవిత సంచలనం!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత టోన్ పెంచారు. ఇన్ డైరెక్ట్ గా కేటీఆర్ను ఉద్దేశించి మాటలు తూటాలు పేల్చారు. బీఆర్ఎస్ లో తనకు ఒకే ఒక నాయకుడు కేసీఆర్ మాత్రమేనని, మరో నాయకుడు లేరంటూ తేల్చి చెప్పారు. పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించనని కూడా కవిత వెల్లడించారు.  

New Update
ktr-kavitha

MLC kavitha VS KTR

MLC kavitha VS KTR: బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత టోన్ పెంచారు. ఇన్ డైరెక్ట్ గా కేటీఆర్ను ఉద్దేశించి మాటలు తూటాలు పేల్చారు. బీఆర్ఎస్ లో తనకు ఒకే ఒక నాయకుడు కేసీఆర్(KCR) మాత్రమేనని, మరో నాయకుడు లేరంటూ తేల్చి చెప్పారు. పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని తాను అంగీకరించనని కూడా కవిత వెల్లడించారు.  తాను కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానన్నారు.  నాకు నీతులు చెప్పేవారికి పార్టీని నడిపించే సత్తా ఉందా అని కవిత ప్రశ్నించారు. కేసీఆర్‌ను మేమే నడిపిస్తున్నామని కొంతమంది చెప్పుకుంటున్నారు. కేసీఆర్‌ను నడిపించేంత పెద్దవాళ్లా అంటూ సొంత పార్టీ లీడర్లను కవిత నిలదీశారు.  

చిచోరా రాజకీయాలు చేయను 

కేసీఆర్‌కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు తెలపలేదని, ఇంకో నేతకు నోటీసులు వస్తే ఎందుకు హంగామా చేస్తున్నారన్నారు కవిత.  తాను వాళ్లలా చిచోరా రాజకీయాలు చేయనని, హుందాగా ఉంటానని చెప్పుకొచ్చారు. నన్ను దూరం చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెలుసనని కవిత తెలిపారు.  కావాలనే తనను ఎంపీ ఎన్నికల్లో ఓడించారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.  వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాల్సిన పనులు చేయాలని ట్వీట్లు చేస్తే సరిపోతుందా అని  ప్రశ్నించారు. పార్టీ చేయాల్సిన సగం పనులు తాను జాగృతితో చేస్తున్నానని వెల్లడించారు. దీంతో  వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఫెయిల్ అయ్యారని కవిత చెప్పకనే చెప్పారని అర్ధం అవుతోంది. 

Also Read:Parcel Bomb: పెళ్లి గిఫ్ట్‌గా పార్సల్ బాంబ్.. ఇద్దరిని చంపిన లెక్చరర్‌‌కి శిక్ష ఏంటో తెలుసా?

తాను జైల్లో ఉన్నప్పుడే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం గురించి వందశాతం ప్రస్తావన జరిగిందని.. అందుకు తాను ఒప్పుకోలేదని కవిత వెల్లడించారు. తాను పార్టీలో ఉంటే కుదరదని.. తనను కేసీఆర్ కు దూరం చేసే కుట్ర జరుగుతుందని కవిత వాపోయారు. తాను కేసీఆర్ లాగే తిక్కదాన్ని అని పదవులు,పైసలు దేన్ని లెక్కచేయనని చెప్పుకొచ్చారు. సూటిగా మాట్లాడుతా, కుట్రలు చేయనని తేల్చి చెప్పారు.  పదవులు పట్టుకుని వేలాడటం తనకు రాదన్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ ఆరోపణలు వచ్చినప్పుడు తాను కేసీఆర్ వద్దకు వెళ్లి రాజీనామా చేస్తానని చెప్పానని..  తన పైన కోపంతో నీ మీద కక్ష చేస్తున్నారు రాజీనామా వద్దని కేసీఆర్  చెప్పారని తెలిపారు.  ఎంపీ ఎన్నికల్లో నీ గెలుపు కోసం ఎమ్మెల్యేలు పనిచేయలేదని తనకు లేటుగా తెలిసిందని కేసీఆర్ చెప్పారని అన్నారు కవిత.  

Also Read: మధ్యప్రదేశ్‌లో విషాదం... కన్నబిడ్డను కాపాడలేనన్న భయంలో ప్రాణం విడిచిన తండ్రి

Advertisment
తాజా కథనాలు