Shock To Trump: ట్రంప్ టారీఫ్ లకు యూఎస్ ఫెడరల్ కోర్ట్ బ్రేక్..

లిబరేషన్ డే పేరుతో అమలు చేసిన సుంకాలను యూఎస్ ఫెడరల్ కోర్టు బ్రేక్ వేసింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి ప్రపంచదేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. 

author-image
By Manogna alamuru
New Update
trump tax on india

Trump Tariffs

టారీఫ్ లతో అన్ని దేశాల మీద ఆధిక్యాన్ని సంపాదిద్దామనుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు యూఎస్ ఫెడరల్ కోర్టు షాకి ఇచ్చింది. సుంకాలను అమలు చేయకూడదని ఆర్డర్లు పాస్ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి ప్రపంచదేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.  దీనిపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ని అభ్యర్థనలను చేసినా న్యాయస్థానం ఒప్పుకోలేదు. అధ్యక్షుడు ట్రంప్ టారీఫ్ అధికారాలను ఒప్పుకోవాలని ఎంత చెప్పినా వినలేదు. 

భారత్-పాక్ కాల్పుల విరమణ సాకు...ఒప్పుకోని కోర్టు

ప్రస్తుతం సుంకాల విషయంలో అమెరికా ప్రభుత్వంతో చాలా దేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఇదే విషయాన్ని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ న్యాయస్థానంలో చెప్పింది.  టారీఫ్ డీల్స్ ను ఖరారు చేసుకునేందుకు జూలై 7 వరకు టైమ్ ఉందని చెప్పినా ఫెడరల్ కోర్టు వినలేదు. కనీసం గడువు వరకు అయినా దీన్ని సున్నితాంశంగా పరిగణించాలని చెప్పినా కోర్టు అంగీకరించలేదు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అక్కడితో ఆగలేదు. ఈ విషయంలో భారత్, పాకిస్తాన్ యుద్ధాన్ని కూడా తీసుకొచ్చింది. సుంకాల వలనే ఇరు దేశాల మధ్యా సంధి కుదిరిందని...ఇప్పుడు వాటిని నిలుపుదల చేస్తే మళ్ళీ ఘర్షణలు తలెత్తుతాయని కూడా చెప్పింది. టారీఫ్ అధికారం వల్లనే భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్‌ సాధించగలిగారు అని కూడా చెప్పారు. దీన్ని కూడా కోర్టు కొట్టిపడేసింది. చివరి అస్త్రంగా చైనాతో వాణిజ్య సంధిని కూడా మార్చేస్తుందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాదించింది. కానీ అన్ని వాదనలను న్యాయస్థానం తిరస్కరించింది. 

today-latest-news-in-telugu | usa | court | trump tariffs

Also Read: RCB VS PBKS: ఫైనల్స్ కు వెళ్ళేది ఎవరు? క్వాలిఫయర్‌ 1లో ఈరోజు పంజాబ్‌ × బెంగళూరు

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు