/rtv/media/media_files/2025/01/20/4djOb33IjwIpdVHfKo1g.jpg)
BRS MLC Kavitha morphing photos issue
Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మార్ఫింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడం సంచలనంగా మారింది. పసుపు బోర్డు విషయంలో బీజేపీ నిజమాబాద్ ఎంపీ అర్వింద్ సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఈ ఫొటోలు షేర్ చేసినట్లు గుర్తించిన బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. @AravindAnnaArmy అనే హ్యాండిల్‌తో పాటు దీని వెనకాల ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ జాగృతి మహిళా విభాగం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
/rtv/media/media_files/2025/01/20/XxsWHCoCNwuvV2gxwZqH.jpg)
సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు..
ఈ మేరకు సోమవారం నాడు మేడ్చల్ జిల్లా తెలంగాణ జాగృతి మహిళా అధ్యక్షురాలు, కార్పొరేటర్ లలిత యాదవ్ ఆధ్వర్యంలో పలువురు సైబర్ క్రైమ్ పోలీసులను కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందించారు. ఫోటోలు మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
/rtv/media/media_files/2025/01/20/brHssUTOM19aL84qObJH.jpg)
ఒక రాజకీయ పార్టీ సంబంధించిన కీలక నాయకుడి ఆర్మీ అంటూ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా అసత్య ప్రచారాలు చేస్తుండడమే కాకుండా ఫోటోను మార్ఫింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో జాగృతి నాయకులు వాసగొని శోభ గౌడ్, బండారి లావణ్య, స్వప్న రెడ్డి, సింగిరెడ్డి విమల రెడ్డి, శ్రీలత, మహేశ్వరి, రత్న, పెంటమ్మ, తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: Hyderabad: గవర్నర్ ప్రతిభా పురస్కారాలను ప్రకటించిన రాజ్‌భవన్.. లిస్ట్ ఇదే!