BRS MLC Kavitha: కవిత దూకుడు.. కొత్త ఆఫీస్ ప్రారంభం.. 4న ఇందిరా పార్క్ వద్ద ధర్నా!

బీఆర్‌ఎస్‌ పార్టీలో ఎమ్మెల్సీ కవిత వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. ఈరోజు ఆమె తెలంగాణ జాగృతి కొత్త ఆఫీస్‌ను ప్రారంభించనున్నారు. కేసీఆర్‌పై కాళేశ్వరం విచారణకు వ్యతిరేకంగా జూన్‌ 4న ధర్నా చేయనున్నారు. 

New Update
BRS MLC Kavita

BRS MLC Kavitha

BRS MLC Kavitha: బీఆర్‌ఎస్‌ పార్టీలో ఎమ్మెల్సీ కవిత వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. ఈరోజు ఆమె తెలంగాణ జాగ-ృతి కొత్త ఆఫీస్‌ను ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు బంజారాహిల్స్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. మరోవైపు మజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు.  కేసీఆర్‌కు నోటీసులు పంపడాన్ని వ్యతిరేకిస్తూ జూన్ 4న ఇందిరాపార్క్‌లో ధర్నా చేయనున్నారు. అక్కడే ఆమె మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్

ప్రస్తుతం కేసీఆర్‌ కుటుంబంలో కేటీఆర్, కవిత మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె కేసీఆర్‌కు పంపించిన లేఖ లీక్‌ కావడం సంచలనం రేపింది. తాజాగా ఆమె కొత్తగా తెలంగాణ జాగృతి ఆఫీస్‌ను ప్రారంభించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఓవైపు కేసీఆర్‌ తనకు దేవుడు లాంటివాడని అంటూనే మరోవైపు పరోక్షంగా కేటీఆర్‌ను కవిత టార్గెట్‌ చేయడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. జూన్ 4న ధర్నా చౌక్‌లో ఆమె మాట్లాడబోతున్నారనేది ఆసక్తిగా మారింది. 

Also Read: పాకిస్తాన్ గేమ్ క్లోస్.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిమాండ్ ఏంటంటే?

 ఇటీవలే తనకు సొంత ఎజెండా అంటూ ఏమిలేదని, పార్టీని కాపాడుకోవాలనేదే తన తపన అని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం(BRS Merged into BJP) చేయొద్దనేది తన వాదన అని పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదని ఆమె అభిప్రాయపడ్డారు. తను జైల్లో ఉన్న సమయంలోనే బీజేపీలో బీఆర్‌ఎస్‌ను కలుపుతామని చెప్పారని కవిత అన్నారు. కాగా బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనాన్ని తాను ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. 

Also Read: ట్రంప్ సాధించేశారు..సుంకాల విషయంలో అనుకూలంగా మరో కోర్టులో తీర్పు

ఇదిలాఉండగా ఇటీవల సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్‌లకు జస్టిస్ పి.సి. ఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఈ కమిషన్ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే 15 రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఈ ముగ్గురు నేతలను ఆదేశించింది.  

Advertisment
తాజా కథనాలు