MLA Padmarao: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావుకు గుండెపోటు!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల డెహ్రాడూన్ టూర్ వెళ్లిన పద్మరావుకు అక్కడే గుండెపోటు వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా పరీక్షలు చేసి స్టంట్ వేసిన వైద్యులు.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు.

New Update
padma rao

BRS MLA Padma rao

MLA Padmarao: సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల డెహ్రాడూన్ టూర్ వెళ్లిన పద్మారావుకు అక్కడే గుండెపోటు వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా పరీక్షలు చేసి  స్టంట్ వేసిన వైద్యులు.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 

జనవరి 21న హైదరాబాద్‎కు..

ఇక 2025 జనవరి 21న పద్మారావు హైద్రాబాద్‎కు రానుండగా గుండెపోటు విషయం తెలియడంతో బీఆర్ఎస్ నేతలు ఆయన ఇంటికి తరలి వెళ్లారు. ఆయన అభిమానులు, సన్నిహితులు, బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఆయన ప్రాణాలకు ప్రమాదం లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక పద్మారావు హెల్త్ కండిషన్‎పై బీఆర్ఎస్ అధిష్టానం ఆరా తీసినట్లు సమాచారం. 

ఇదికూడా చదవండి: Encounter: ఛత్తీస్‌ఘడ్ ఎన్‌కౌంటర్‌లో నల్గొండ వాసి మృతి.. ఆ గ్రామంలో విషాద ఛాయలు!

హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌కు పద్మారావు బలమైన నేతగా ఉన్నారు. 2001లో టీఆర్ఎస్ లో చేరిన ఆయన.. 2004లో తొలిసారి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2009 ఎన్నికల్లో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014 నుంచి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2014 నుంచి 2018 వరకు ఎక్సైజ్, స్పోర్ట్స్ శాఖ మంత్రిగా పనిచేశారు 2019లో తెలంగాణ రెండో అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా విధులు నిర్వర్తించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు