MLA Padmarao: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావుకు గుండెపోటు!
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల డెహ్రాడూన్ టూర్ వెళ్లిన పద్మరావుకు అక్కడే గుండెపోటు వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా పరీక్షలు చేసి స్టంట్ వేసిన వైద్యులు.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు.