Encounter: ఛత్తీస్‌ఘడ్ ఎన్‌కౌంటర్‌లో నల్గొండ వాసి మృతి.. ఆ గ్రామంలో విషాద ఛాయలు!

ఛత్తీస్‌ఘడ్ గరియాబాద్‌ భారీ ఎన్ కౌంటర్‌లో నల్గొండ జిల్లా వాసి మృతిచెందాడు. చండూరు మండలం పుల్లెంలకు చెందని పాక హన్మంతు కాల్పుల్లో మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. 45ఏళ్ల క్రితం హనుమంతు మావోయిస్టు పార్టీలోకి వెళ్లగా ఆయన మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది. 

New Update
maoist

Nalgonda resident Maoist Hanmantu

Encounter: ఛత్తీస్‌ఘడ్ గరియాబాద్‌లో జరిగిన భారీ ఎన్ కౌంటర్‌లో నల్గొండ జిల్లా వాసి మృతిచెందాడు. చండూరు మండలం పుల్లెంలకు చెందని పాక హన్మంతు మరణించినట్టు పోలీసులు వెల్లడించారు. 45 ఏళ్ల క్రితం హనుమంతు మావోయిస్టు పార్టీలోకి వెళ్లగా ఆయన మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది. పాక హనుమంతుతోపాటు సిద్దిపేట జిల్లా కోహెడకు చెందిన కట్ట రామచందర్ రెడ్డి, అలియా స్ వికల్స్,కుడా  మృతి చెందినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీస్ అధికారులు వెల్లడించారు. దీంతో రెండు గ్రామాల్లో విషాదం నెలకొనగా.. 45 సంవత్సరాల క్రితం పాక హనుమంతు మావోయిస్టు పార్టీలోకి వెళ్లారు. ఈ 45 ఏళ్ల పాటు అజ్ఞాతంలోనే గడిపారు. నల్లగొండ పట్టణంలోని ఏబీవీపీ నాయకుడు శ్రీనివాస్ హత్యలో పాక హనుమంతు నిందితుడు. ఆ తర్వాతే హనుమంతు మావోయిస్టు పార్టీలోకి వెళ్ళాడు.

 ఈ మేరకు మంగళవారం ఉదయం ఒడిశా-ఛత్తీస్‌గఢ్  సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్‌లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దాదాపుగా20 మంది మావోయిస్ట్‌లు చనిపోయారు. 14 మంది మృతుల డెడ్ బాడీలు దొరికాయి. చనిపోయిన  మావోయిస్ట్‌లలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.

మావోయిస్టు అగ్రనేతలు మృతి.. 

ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. సెంట్రల్ కమిటీ సభ్యుడు మనోజ్‌, ఛత్తీస్‌గఢ్ మావోయిస్ట్ పార్టీ ఇంఛార్జ్ జయరాం అలియాస్ చలపతి పాటు మరో కీలక అగ్రనేత వీరిలో ఉన్నారని సమాచారం. మావోయిస్టు కార్యదర్శి చలపతిపై రూ. కోటి రివార్డు ఉందని అధికారులు వెల్లడించారు. చలపతి అలియాస్ రాంచంద్రారెడ్డి స్వస్థలం చిత్తూరు జిల్లా. కాగా నల్గొండకు చెదిన హన్మంతు కూడా మృతుల్లో ఒకరని పోలీసులు తెలిపారు. 

ఇది కూడా చదవండి: 5 రోజుల తర్వాత హాస్పిటల్‌ నుంచి ఇంటికి.. సైఫ్ట్ అలీ ఖాన్ డిశ్చార్జ్

ఎన్‌కౌంటర్‌  అనంతరం భారీగా ఆయుధాలు, వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల అంతమే లక్ష్యంగా కోబ్రా, డీఆర్జీ, సీఆర్పీఎఫ్ (CRPF), ఒడిశా SOG బలగాలు చేపట్టిన ఈ ఆపరేషన్‌లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతిచెందారని అధికారులు తెలిపారు. ఇక ఒడిశా ఎన్‌కౌంటర్‌పై కేంద్రహోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న భద్రతా సిబ్బందికి అమిత్‌ షా ప్రసంశలు కురిపించారు.  మన భద్రతాదళాలు సాధించిన గొప్ప విజయమని పేర్కొన్నారు.  నక్సల్స్‌ లేని భారత్‌ దిశగా ఇది కీలక అడుగు అని పేర్కొన్నారు. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందన్నారు.  దేశంలో నక్సలిజం చివరి దశకు చేరింది- అమిత్ షా అభిప్రాయపడ్దారు.  

ఇది కూడా చదవండి: Delhi Elections: కేజీ టు పీజీ ఫ్రీ, వాళ్లకి రూ.15 వేలు ఆర్థిక సాయం.. మరో మేనిఫెస్టో ప్రకటించిన బీజేపీ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు