క్షమాపణ చెప్పాకే రావాలి.. రాహుల్: KTR

TG: ప్రజలకు క్షమాపణలు చెప్పాకే రాహుల్ తెలంగాణకు రావాలని అన్నారు కేటీఆర్. ఎన్నికలకు ముందు తెలంగాణలో ఏ పిల్లాడికి కూడా కష్టమొచ్చిన సరే ఇలా పిలుస్తే అలా వస్తానని చెప్పి.. తీరా గద్దెనెక్కిన తర్వాత మా ప్రజల గొంతును తడిగుడ్డతో కోశారని ధ్వజమెత్తారు.

New Update
KTR PIc

MLA KTR : కాంగ్రెస్, రాహుల్ గాంధీపై మరోసారి విమర్శల డాదికి దిగారు బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్. ఈరోజు తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. అధికారం కోసం అడ్డగోలు హమీలిచ్చి, సబ్బండ వర్గాలకు చేసిన మోసం, అభివృద్ధి తెలంగాణను అవినీతి తెలంగాణగా మార్చినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున యావత్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాహుల్‌ గాంధీని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. పదేళ్లలో ఘనంగా అభివృద్ధి చెందిన తెలంగాణకు విచ్చేస్తున్న రాహుల్ గాంధీకి.. పచ్చగా ఉన్న తెలంగాణ మీ ఏడాది పాలనలోనే ఏ విధంగా వందేళ్ల విధ్వంసానికి గురైందో మీ రాక సందర్భంగా ఒక్కసారి మీకు గుర్తు చేయదలచుకున్నానన్నారు. 

Also Read :  గుజరాత్‌లో దారుణం.. ఊపిరాడక కారులో నలుగురు చిన్నారులు

ఢిల్లీలో గప్‌చుప్‌...

ఎన్నికలకు ముందు తెలంగాణలో ఏ పిల్లాడికి కూడా కష్టమొచ్చిన సరే ఇలా పిలుస్తే అలా వస్తానని చెప్పి.. తీరా గద్దెనెక్కిన తర్వాత మా ప్రజల గొంతును తడిగుడ్డతో కోశారని ధ్వజమెత్తారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆటోడ్రైవర్లు, చేనేత కార్మికులు, మూసీ, హైడ్రా బాధితులు ఇలా ఒక్కరంటే సమాజంలో అన్ని వర్గాలను నయనంచనకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన ఒక్క హామీని సైతం నిలబెట్టకోకుండా ప్రజలను మోసం చేశారని.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను హింసించే పులకేసి మాదిరిగా హింసిస్తుంటే.. ఏం తెలియనట్లుగా నటిస్తూ ఢిల్లీలో గప్‌చుప్‌ అయిపోయారని విమర్శించారు.

Also Read :  హీరో విజయ్ దేవరకొండకు ప్రమాదం.. VD12 షూటింగ్ లో అలా..!

Also Read :  ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం

Also Read :  టీడీపీ మాజీ మంత్రి మృతి!

Advertisment
తాజా కథనాలు