Reddy Satyanarayana: టీడీపీ మాజీ మంత్రి మృతి! AP: మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ (99) కన్నుమూశారు. ఈరోజు ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలో ఆయన తుదిశ్వాస విడిచారు. వయసురీత్యా వచ్చిన అనారోగ్య కారణాలతో మృతిచెందారు. By V.J Reddy 05 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Satyanarayana : టీడీపీలో విషాదం చోటుచేసుకుంది. మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ (99) కన్నుమూశారు. ఈరోజు ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలో ఆయన తుదిశ్వాస విడిచారు. వయసురీత్యా వచ్చిన అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో మాడుగుల నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్ నెలకొల్పారు. Also Read : అమెరికా ఎన్నికలు ఎలా జరుగుతాయి..బ్యాలెట్ పేపర్‌లో ఉండే అంశాలేంటి? మంత్రిగా బాధ్యతలు... ఎన్టీఆర్ హయాంలో ఆయనను మంత్రి పదవి వరించింది. ఎన్టీఆర్ ఆయనకు పశుసంవర్ధక శాఖ బాధ్యతలు అప్పగించారు. కాగా టీడీపీ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన ఆయన వరుసగా 1983, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో విజయం సాధించి మాడుగుల నియోజకవర్గంలో పసుపు జెండా ఎగురవేశారు. మాడుగుల నియోజకవర్గాన్ని తన అడ్డాగా మార్చుకున్నారు. ఆయన అకాల మరణం పట్ల పలువురు టీడీపీ నేతలు, వివిధ పార్టీ నేతలు సంతాపం తెలియజేస్తున్నారు. బుధవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. Also Read : తెలుగు వారిని ఘోరంగా అవమానించిన తమిళనటి.. సేవ చేయడమే వారి పని అంటూ Also Read : Live In Relationship: కామాంధుడి అరాచకం.. తల్లితో సహజీవనం.. కట్ చేస్తే కూతురితో.. సీఎం చంద్రబాబు సంతాపం... మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత రెడ్డి సత్యనారాయణ మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. 5 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా చేసిన సత్యనారాయణ నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. మాడుగుల నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేసి, నియోజకవర్గ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న సత్యనారాయణ మృతి తీవ్ర విచారం కలిగించిందన్నారు. మంత్రిగా పని చేసి పదవులకు వన్నె తెచ్చారన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. Also Read : Telangana: కులమే కాదు.. ఆస్తి, అప్పులతో పాటు ఆ 75 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే #tdp #anakapalle-district #reddy-satyanarayana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి