హీరో విజయ్ దేవరకొండకు ప్రమాదం.. VD12 షూటింగ్ లో అలా..!

స్టార్ హీరో విజయ్ దేవరకొండ గాయపడినట్లు తెలుస్తోంది. VD12 షూటింగ్ లో యాక్షన్ సీన్స్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం. చిత్ర యూనిట్ వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు ఫిజియో థెరఫీ చికిత్స అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

New Update

Vijay Devarakonda: ఇటీవలే 'ఫ్యామిలీ స్టార్' సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించిన రౌడీ భాయ్ విజయ్ దేవరకొండ.. ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 చేస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. 

Also Read: బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్.. నిఖిల్ చేసిన పనికి యష్మీ ఎలిమినేటెడ్..!

షూటింగ్ లో విజయ్ కి గాయాలు 

అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ లో హీరో విజయ్ గాయపడినట్లు తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా.. విజయ్ కు ప్రమాదం జరిగినట్లు సమాచారం. వెంటనే చిత్ర యూనిట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు ఫిజియో థెరఫీ చికిస్త అందిస్తున్నట్లు  వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజుల రెస్ట్ తర్వాత విజయ్ తిరిగి షూటింగ్ లో పాల్గొననున్నట్లు టాక్.  అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి స్పందన లేదు. 

Also Read: హీరో విజయ్ దేవరకొండకు ప్రమాదం.. VD12 షూటింగ్ లో అలా..!

ఇప్పటికే VD12 నుంచి విడుదలైన పోస్టర్స్ లో విజయ్ లుక్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఇందులో విజయ్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారనే టాక్ ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచుతోంది. ఇంతకుముందు వచ్చిన లైగర్, ఫ్యామిలీ స్టార్ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో   VD12 విజయ్ కంబ్యాక్ ఫిల్మ్ కాబోతుందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు రౌడీ భాయ్ ఫ్యాన్స్. ఇటీవలే విజయ్ ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ 'కల్కి 2898 AD' లో క్యామియో రోల్లో కనిపించారు. అర్జునుడు పాత్రలో కనిపించి ఫ్యాన్స్ ను అలరించారు. 

Also Read: వరుణ్, లావణ్య మొదటి పెళ్లిరోజుకు మెగాస్టార్ అదిరిపోయే గిఫ్ట్!.. వీడియో వైరల్

Also Read: చిరు, నాగ్, వెంకీలో నాకు ఇష్టమైన హీరో అతనే.. బాలయ్య భలే చెప్పాడుగా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు