ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం TG: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. FIR నుంచి మత్తయ్య పేరును తొలగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఎల్విస్ స్టీఫెన్‌సన్ దాఖలు చేసిన కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర వైదొలిగారు. By V.J Reddy 05 Nov 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి Note For Vote Case: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నుంచి జెరూసలెం మత్తయ్య పేరును తొలగిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఎల్విస్ స్టీఫెన్‌సన్ దాఖలు చేసిన కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ వైదొలిగారు. కాగా నిన్న ఈ కేసు జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చిన వెంటనే జస్టిస్ శర్మ దాని నుంచి వైదొలగుతున్నట్లు జస్టిస్ త్రివేది దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జస్టిస్ త్రివేది.. ఈ కేసును మరో ధర్మాసనం ముందు లిస్ట్ చేయాలని వారికి ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసులో ఇదివరకు మత్తయ్య తరఫున అమికస్‌క్యూరీగా వ్యవహరించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే కూడా తనను ఈ కేసు వాదనల నుంచి తప్పించాలని ధర్మాసనానికి కోరారు. కాగా దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ధర్మాసనం తీసుకోలేదు. ఈ కేసు ఏంటి? 2015లో తెలంగాణ (Telangana) లో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టేందుకు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రయత్నించారని తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. రేవంత్ రెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో చర్చలు జరిపిన వీడియోను సైతం ఏసీబీ విడుదల చేయడంతో అది సంచలనంగా మారింది. ఆ కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్టీఫెన్ సన్ తో జరిపిన ఫోన్ సంభాషణలు కూడా బయటకు రావడంతో కేసు మరింత సంచలనంగా మారింది. నాటి సీఎం కేసీఆర్, అప్పటి ఏపీ ప్రతిపక్ష నేత జగన్ చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఏపీలో దోచుకున్న డబ్బుతో చంద్రబాబు తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నించారని వైసీపీ నేతలు ఆరోపించారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి