గుజరాత్‌లో దారుణం.. ఊపిరాడక కారులో నలుగురు చిన్నారులు గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలోని దంపతులు వ్యవసాయ పనుల కోసం ఇంట్లోనే ఏడుగురు పిల్లలను వదిలేసి వెళ్లారు. ఇంటి దగ్గరే ఉన్న కారులో ఆడుకుని ఊపిరాడక నలుగురు పిల్లలు ఊపిరాడక చనిపోయారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు కారులో విగతజీవులుగా కనిపించారు. By Kusuma 05 Nov 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి కారులో ఆడుకుంటూ ఊపిరాడక నలుగురు చిన్నారులు చనిపోయిన విషాద ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలోని రంధియాలో ఈ దారుణ ఘటన జరిగింది. ఈ గ్రామానికి చెందిన ఓ దంపతులు వ్యవసాయ పనుల కోసం ఏడుగురు పిల్లలను ఇంట్లోనే ఉంచి వెళ్లారు. పిల్లలు ఇంటి దగ్గర ఆడుకున్నారు. ఇది కూడా చూడండి: ఎండతో నడిచే కారు.. ఒకసారి ఛార్జింగ్‌తో 1600KM.. కారులో ఆడుకుంటూ.. ఆ ఇంటి దగ్గర ఓ కారు ఉండగా అందులో చిన్నారులు ఆడుకోగా.. నలుగురు చిన్నారులు ఊపిరాడక చనిపోయారు. తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు కనిపించడం లేదని వెతికారు. చివరికి కారులో చూడగా చనిపోయి ఉన్నారు. పిల్లలు మరణించడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఇది కూడా చూడండి: Jio IPO: త్వరలో రాబోతున్న జియో ఐపీఓ.. ఎప్పుడంటే? ఇదిలా ఉండగా.. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో కూడా ఇలాంటి విషాధ ఘటన చోటుచేసుకుంది. నల్గొండ జిల్లాకి చెందిన ఆలకుంట చందు, సరోజ దంపతులు హయత్‌నగర్‌లో ఉంటున్నారు. వీరికి ఏకైక సంతానమైన ఏడేళ్ల అజయ్ అనే కుమారుడు ఉన్నాడు. బతుకు తెరువు కోసం హయత్‌నగర్‌లోని ముదిరాజ్ కాలనీలో ఉంటున్నారు. ఇది కూడా చూడండి: నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. సర్వేలు ఏం చెబుతున్నాయంటే? సాయంత్రం 3:45 గంటలకు స్కూల్ కూడా పూర్తయ్యింది. అలా ఇంటికి వెళ్లడానికి బయటకు వస్తుండగా.. స్కూల్ గేట్ దగ్గర పిల్లలు ఆడుకోవడం చూశాడు. దీంతో ఇంటికి వెళ్లడానికి వ్యాన్ ఎక్కకుండా ఆ గేట్ ఎక్కి ఊగాడు. ఆ బాలుడు ఎక్కినప్పుడు ఆ గేట్ ఒక్కసారిగా ఊడిపోయి అజయ్ మీద పడింది. దీంతో అజయ్‌కి ఊపిరి ఆడక వెంటనే సొమ్మసిల్లి కింద పడిపోయాడు.అజయ్‌ను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయింది. ఇది కూడా చూడండి: Rangareddy District: బాలుడి ప్రాణం తీసిన స్కూల్ గేట్.. #gujarath మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి