/rtv/media/media_files/2024/11/11/91Z9ZAJKV7T1a5ha0GsF.jpg)
Harish Rao sensational allegations on CM Revanth
TG News: సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ కోసం ఇచ్చిన చెక్కులు డమ్మీ కావొచ్చంటూ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. అబద్ధాలు చెప్పడంతోపాటు అప్పులు చేయడంలో సీఎంతో ఆర్థిక మంత్రి సీఎం భట్టి విక్రమార్క గోబెల్స్‌ను మించి పోతున్నారన్నారు. రూ. 4 లక్షల కోట్ల అప్పు ఉంటే రూ. 8 లక్షలు అని అసెంబ్లీలో అబద్దాలు మాట్లాడాతున్నారని మండిపడ్డారు. పూటకో తీరు మాట్లాడుతున్నారని, నాగర్ కర్నూల్ లో BRS హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తికాలేదు, ఒక్క ఎకరానికి నీరు ఇవ్వలేదనడం హాస్యస్పదమన్నారు. తాము మహబూబ్ నగర్ జిల్లాలోనే రూ. 4 వేల కోట్లు ఖర్చుపెట్టి ఆరున్నర లక్షల ఎకరాలకు నిరిచ్చామని చెప్పారు. కాంగ్రెస్ పక్కకు పెట్టిన రాజోలి బండని పూర్తి చేశామని, తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశామని చెబుతున్న భట్టి వ్యాఖ్యలపై తాను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని, ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తానంటూ సవాల్ విసిరారు.
రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు..
రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ రైతులను దగా చేస్తుంది. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదు. రూ. 2750 కోట్ల రూపాయలు చెక్కుని రుణమాఫీ కోసం నవంబర్ 30న సీఎం రేవంత్ ఇచ్చారు. సీఎం రేవంత్ ఇచ్చిన చెక్కు డమ్మీది కావచ్చు. లేదా దారి తప్పిపోయిందా? రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దగాని ప్రజలు గమనించాలి. కేసీఆర్ రైతుల కడుపులో సల్ల కదలకుండా చూసుకుంటే 13 నెలల్లో సీఎం రేవంత్ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. కాంగ్రెస్ పథకాల తీరు అయితే ఎగవేతలు లేకపోతే కోతలన్నారు. ఇక రైతులందరూ కలిసి ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: Maha Kumbh Mela: మహా కుంభమేళా.. యూపీకి రూ.2 లక్షల కోట్ల ఆదాయం !
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి మనకి రావాల్సిన పథకాలు తీసుకుందామన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అంటే దళిత గిరిజన రైతుల పొట్ట కొట్టుడేనా అని ప్రశ్నించారు. కోటి మంది కూలీలు ఉంటే రూ.10 లక్షల మందికే పథకాన్ని ఇస్తామని చెబుతున్నారట. మాట తప్పినందుకు సీఎం రేవంత్ రైతులకు, కూలీలకు క్షమాపణ చెప్పాలి. గ్రామసభలు పెడితే మీపై కూలీలు తిరగబడతారు జాగ్రత్త. ఎకరంలోపు భూమి ఉన్నవారిని కూలీలుగా గుర్తించి రూ.12 వేలు ఇవ్వాల్సిందేనన్నారు.
 Follow Us
 Follow Us