Kaushik Reddy Arrest: కౌశిక్ రెడ్డి అరెస్టు.. డీజీపీకి కాల్‌ చేసిన హరీశ్‌ రావు

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో డీజీపీ జితేందర్ రెడ్డికి హరీష్ రావు ఫోన్ చేశారు. అరెస్ట్ చేయదగిన కేసు కాకపోయినప్పటికీ.. అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. తక్షణమే స్టేషన్ బెయిల్‌పై కౌశిక్ రెడ్డిని విడుదల చేయాలని కోరారు.

New Update
Kaushik Reddy and Harish Rao

Kaushik Reddy and Harish Rao

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే  కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో డీజీపీ జితేందర్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్ చేశారు. అరెస్ట్ చేయదగిన కేసు కాకపోయినప్పటికీ.. పండుగ వేళ ప్రజా ప్రతినిధిని అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి అక్రమ కేసు బనాయించడం తగదని.. కక్షసాధింపు చర్యలకు పోలీసులు సహకరించవద్దని సూచనలు చేశారు. తక్షణమే స్టేషన్ బెయిల్‌పై కౌశిక్ రెడ్డిని విడుదల చేయాలని కోరారు.

Also Read: దేవుళ్లు, రాక్షసుల మధ్య యుద్ధం జరిగితే.. కుంభమేళ ఎందుకొచ్చిందంటే..?

కరీంనగర్‌ కలెక్టరేట్‌లో ప్రభుత్వ పథకాలకు సంబంధించి జరిగిన కార్యక్రమలో కౌశిక్ రెడ్డి.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో సంజయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం జూబ్లిహీల్స్‌లో కౌశిక్‌ రెడ్డిని అరెస్టు చేశారు.హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌కు తరలించారు. కౌశిక్ రెడ్డి అరెస్టుపై కేటీఆర్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు.  రెడ్డిని అక్రమంగా అరెస్టుచేయడం అత్యంత దుర్మార్గమైన చర్యని మండిపడ్డారు. రోజుకో బీఆర్ఎస్‌ నేతను అన్యాయంగా అరెస్టు చేయడం రేవంత్‌ సర్కార్‌కు అలవాటైందని విమర్శించారు.

Also Read: అసలు మనిషేనా వీడు.. గిరిజన విద్యార్థినులు చేత టాయిలెట్లు కడిగించాడు!

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి దిగజారుడు పనులకు దిగుతున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను వెనకేసుకొచ్చి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఏకపక్షంగా అరెస్టుచేయడం పూర్తిగా అప్రజాస్వామికం. హుజూరాబాద్ నియోజకవర్గంలో రైతురుణమాఫీని ఎగ్గొట్టి, దళితబంధుకు పాతరేసిన కాంగ్రెస్ సర్కారును ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకే రేవంత్ ఈ అణచివేత చర్యలకు దిగుతున్నారు. కౌశిక్ రెడ్డిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని'' రాసుకొచ్చారు.

Also Read: చైనా, ఇండియా సరిహద్దులో గన్ వాడకూడదు.. ఎందుకంటే?

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు