Kaushik Reddy Arrest: కౌశిక్ రెడ్డి అరెస్టు.. డీజీపీకి కాల్ చేసిన హరీశ్ రావు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో డీజీపీ జితేందర్ రెడ్డికి హరీష్ రావు ఫోన్ చేశారు. అరెస్ట్ చేయదగిన కేసు కాకపోయినప్పటికీ.. అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. తక్షణమే స్టేషన్ బెయిల్పై కౌశిక్ రెడ్డిని విడుదల చేయాలని కోరారు.