చైనా, ఇండియా సరిహద్దులో గన్ వాడకూడదు.. ఎందుకంటే?

సరిహద్దు సమీపంలో చైనా సైనిక విన్యాసాలు చర్చనీయాంశమైయ్యాయి. చైనా, భారత్ ల మధ్య సైనిక ఒప్పందం జరిగి 4 నెలలు కూడా కాలేదు అప్పుడే చైనా బార్డర్‌లో కవ్వింపు చర్యలకు పాల్పడింది. 1996 ఒప్పందం ప్రకారం LACలో గన్స్, పేలుడు పదార్థాలు ఉపయోగించడాన్ని నిషేధించారు.

New Update
china Vs bharath

china Vs bharath Photograph: (china Vs bharath)

LAC.. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. చైనా, భారత్ మధ్య పచ్చగడ్డి వేస్తే అది బగ్గుమంటోంది.. అంత వైరం. అలాంటి దేశాలు ఒక్కసారిగా చర్చలకు వచ్చి కలిసిపోయాయి అంటే నమ్ముతారా? అవును ఇది జరిగింది. అది 2024 అక్టోబర్‌ 23. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రష్యాలోని కజాన్‌లో సమావేశమయ్యారు. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు మధ్య చర్చలు జరిగాయి. అవి విజయవంతమై రెండు దేశాలు తమ తమ సైన్యాన్ని వెనక్కి తీసుకున్నాయి. ఒప్పందం జరిగి 4 నెలలు కూడా కాలేదు. ఇంతలోనే డ్రాగన్‌కు ఏం తట్టిందో ఇండియా సరిహద్దుకు సమీపంలో సైనిక విన్యాసం చేసింది. చైనా, ఇండియా బార్డర్ గురించి చెప్పాలంటే.. బిఫోర్ 2020, ఆఫ్టర్ 2020 అనే చెప్పాలి. 

లద్దాక్ గాల్వాన్ లోయ..

2020 జూన్ 6న ఇండియా, చైనాల మధ్య లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలు జరిగాయి. గాల్వాన్ లోయలో రెండు వైపులా పెట్రోల్ పాయింట్ 14 వద్ద సైన్యం వైదొలిగింది. ఎందుకంటే రెండు దేశాల సైన్యం LACకి చాలా దగ్గరగా వచ్చారు. జూన్ 14న అకస్మాత్తుగా LAC వద్ద ఒక చైనా పార్టీ అబ్జర్వేషన్ పోస్ట్‌ను ఏర్పాటు చేసింది. అబ్జర్వేషన్ పోస్ట్, టెంట్లు చట్టవిరుద్ధమని జూన్ 6 సమావేశంలో వచ్చిన ఒప్పందానికి కట్టుబడి ఉండాలని జూన్ 15న కల్నల్ బాబు చైనా కమాండర్‌కు చెప్పారు. దానికి చైనా సైన్యం అంగీకరించలేదు. కల్నల్ సంతోష్ బాబు మాట్లాడుతుండగా.. అతన్ని వెనక్కి నెట్టి, రాళ్ల దాడి చేసింది చైనా ఆర్మీ. తమ కల్నల్ పై దాడిని చూసి ఇండియన్ ఆర్మీకూడా ప్రతి దాడికి దిగింది.

1962లో ఇండియా, చైనా యుద్ధం

అగ్రిమెంట్ ప్రకారం.. LAC ప్రాంతంలో గన్స్, కత్తులు, బాంబులు వంటి ఆయుధాలు వాడకూడదు. దీంతో  ఇండియా, చైనా ఆర్మీ చేతులతోనే యుద్ధం చేశారు. ఈ కొట్లాటలో ఇండియా గెలిచింది. చైనా పోస్ట్‌ను కూడా ద్వంసం చేసి.. చైనా సైనికులను తరిమికొట్టారు. కానీ.. దురదృష్టవశాత్తు దాడిలో కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది సైనికులు వీరమరణం పొందారు. 1975 తర్వాత చైనా భారత్ సైన్యం మధ్య జరిగిన పెద్ద ఘర్షణ ఇదే. అప్పటి నుంచి చైనా, భారత్ సరిహద్దులో యుద్ధవాతావరణం ఏర్పడింది. తరుచూ చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. 1962లో చైనా, భారత్‌కు మధ్య యుద్ధం వచ్చింది. అందులో 3250 మంది భారత సైనికులు చనిపోయారు. అప్పుడు చైనా ఆర్మీ ఇండియాలోకి చొచ్చుకు వచ్చి కొంత భాగాన్ని అక్రమించింది. 

మెక్ మోహన్ లైన్

1949లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను మావో జెడాంగ్ స్థాపించారు. 1950 ఏప్రిల్ 1న ఆ దేశాన్ని భారత్ గుర్తించి, దౌత్య సంబంధాలను ప్రారంభించింది. భారత్, చైనాల మధ్య ఉన్న బారర్డ్ లైన్‌ను మెక్ మోహన్ లైన్ అంటారు. దీని పొడవు 890 కిలో మీటర్లు. జమ్మూ అండ్ కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు చైనాతో బార్డర్ పంచుకుంటాయి. లద్దాక్‌లోని అక్సాన్ చిన్, జమ్మూలోని సియాచిన్ గ్లేసియర్ విషయాల్లో చైనా భారత్‌కు తరుచూ గొడవలు అవుతున్నాయి. 1950 మధ్యకాలం నుంచి భారత్ భూభాగాలను చైనా ఆక్రమించుకోవడం ప్రారంభించింది. 1957లో అక్సాయ్ చిన్ గుండా పశ్చిమగా 179 కి.మీల రోడ్డును చైనా నిర్మించింది. సరిహద్దు వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య 1959 ఆగస్టు 25న తొలిసారి ఘర్షణలు చెలరేగాయి.

LACలో గన్ ఎందుకు వాడకూడదంటే..?

2021 సెప్టెంబరులో భారత్ తన సైనికులపై కాల్పులు జరిపిందని చైనా ఆరోపించింది. చైనా గాలిలోకి కాల్పులు జరుపుతోందని భారత్ ఆరోపించింది. అదే నిజమైతే.. సరిహద్దులో గన్ ఫైరింగ్ 45ఏళ్లలో ఇదే మొదటిసారి. 1996 ఒప్పందం ప్రకారం LAC బార్డర్‌లో గన్స్, పేలుడు పదార్థాలు ఉపయోగించడాన్ని నిషేధించారు. 2022 డిసెంబర్‌లో కూడా ఇండియా, చైనా ఆర్మీ ఘర్షణ దిగారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ సమీపంలో ఇది జరిగింది. ఇరువైపులా సైనికులకు స్వల్ప గాయాలయ్యాయి. కాల్పులు జరపకున్నా.. చైనా ఇండియా సరిహద్దు వెంటే ఎప్పుడూ ఏదో ఓ నిర్మాణం చేపడుతూ.. సైన్యాన్ని మోహరిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తరుచూ వివాదాలు లెవనెత్తుతూనే ఉంటుంది. 

గతంలో భారత్, చైనా సంబంధాలు..

2023లో భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్, అక్సాన్ చిన్ ప్రాంతాలను తమ దేశాలుగా చూపుతూ డ్రాగన్ దేశం స్టాండర్డ్ మ్యాప్ విడుదల చేసింది. దీన్ని భారత్ ఐక్యరాజ్య సమితి వేదిగా ఖండించింది. 2023 మే 27న సిక్కిం సమీపంలోని సరిహద్దులకు 150 కి. మీ  దూరంలో  J20 ఫైటర్ జెట్లను మోహరించింది. శాటిలైట్ ద్వారా సేకరించిన విజవల్స్‌లో ఈ విషయం భారత్‌కు తెలిసింది. వాస్తవాదీన రేఖ వెంబడి శాంతి నెలకొల్పాలని భారత్ ప్రయత్నిస్తుంటే.. చైనా ఏదో ఒక కవ్వింపు చర్యతో యుద్దానికి కాలు దువ్వుతుంది. 2024 అక్టోబర్‌ 21న లడఖ్‌లోని కాంగ్‌కాలో కాల్పులు జరిగాయి. ఆ ఘటనలో 17 మంది భారత సైనికులు మృతి చెందారు. ఆత్మ రక్షణలో భాగంగానే తాము ఈ కాల్పులు జరిపినట్లు చైనా చెప్పింది. తమ సైనికులపై అకస్మాత్తుగా దాడి జరిగిందని భారత్ చెప్పుకొచ్చింది.

LAC దగ్గర చైనా సైనిక విన్యాసాలు

తాజాగా తూర్పు లడఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఎసి) సమీపంలో చైనా సైనిక విన్యాసాలు నిర్వహించింది. అత్యంత కఠిన ప్రదేశాల్లో యుద్ధ సన్నద్ధత, లాజిస్టిక్స్‌ సరఫరా వంటి అంశాలను దృష్టిలోపెట్టుకొని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వీటిని నిర్వహిస్తోంది. ఇండియన్ ఆర్మీ డే జనవరి 15కి కొన్ని రోజుల ముందే జనవరి 13న చైనా ఈ సైనిక విన్యాసం నిర్వహించింది. దీంతో ఈ విషయం ఇంటర్‌నేషనల్ హాట్‌ టాఫిక్‌గా మారింది. జిన్‌జియాంగ్ మిలిటరీ కమాండ్‌కు చెందిన రెజిమెంట్ ఈ మిలటరీ ఎక్స్‌ర్‌సైజ్‌ చేపట్టింది. అత్యాధునిక సైనిక టెక్నాలజీ, ఆల్‌ టెర్రైన్‌ వెహికల్స్‌, అన్‌మ్యాన్డ్‌ సిస్టమ్స్‌, డ్రోన్లు, ఎక్సో స్కెలిటెన్స్‌ వంటి వాటిని ఈ విన్యాసాల్లో వినియోగిస్తున్నారు. దీంతో ఇప్పుడు భారత ధళాలు అలెర్ట్ అయ్యాయి. 

గతంలోకూడా చైనా కవ్వింపు చర్యలు

2024 డిసెంబర్‌లో కూడా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులకు సమీపంలో చైనా హెలిపోర్ట్ నిర్మాణ పనులు చేపట్టింది. 2024 సెప్టెంబరు 16వ తేదీన శాటిలైట్ మాక్సర్ తీసిన హై రిజల్యూషన్ ఫోటోల్లో అత్యాధునిక హెలిపోర్ట్ నిర్మాణం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ హెలిపోర్ట్‌లో 600 మీటర్ల రన్‌వేను ఉంది. తైవాన్‌ సరిహద్ధులో కూడా చైనా తరుచూ సైనిక విన్యాసాలు చేపడుతుంది. తెవాన్‌ను చైనాలో అంతర్భాగమని చైనా చెప్పుకుంటుంది. 2024 అక్టోబర్ 21న 16వ బ్రిక్స్ సమావేశం జరిగింది. చైనా అధ్యక్షుడు జిగ్ పింగ్, ఇండియా ప్రధానిల మధ్య కీలక సైనిక ఒప్పందం కుదిరింది. భారతదేశం-చైనా సరిహద్దు ప్రాంతాలలో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి పెట్రోలింగ్ పునఃప్రారంభించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి పెట్రోలింగ్ ఏర్పాట్లపై ఒక ఒప్పందం కుదిరింది. ఇరు దేశాలు తమ సైన్యాన్ని LAC నుంచి వెనక్కి తీసుకున్నాయి. దీంతో పరిస్థితులు చక్కబడ్డాయి అనుకునే లోగా మళ్లి ఇండియా బార్డర్‌లో చైనా సైనిక విన్యాసం భారత్‌లో ఆందోళన రేకెత్తిస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు