Kavita: కవితపై వేటు.. పార్టీ నేతల సంచలన రియాక్షన్ ఇదే

మాజీ సీఎం కేసీఆర్.. ఎమ్మెల్సీ కవితను బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పార్టీ నేతలు చెబుతున్నారు. దీనికి పూర్తిగా మద్దతిస్తున్నామని పేర్కొన్నారు.

New Update
Kavita

Kavita

మాజీ సీఎం కేసీఆర్.. ఎమ్మెల్సీ కవితను బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఆమె చేస్తున్న ఆరోపణలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయనే కారణంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని  స్వాగతిస్తున్నామని పార్టీ నేతలు చెబుతున్నారు. దీనికి పూర్తిగా మద్దతిస్తున్నామని పేర్కొన్నారు. కవితను సస్పెండ్ చేయడంతో మహిళా నేతలే ఎక్కువగా సంతోషిస్తున్నారని.. ఆమె ప్రవర్తించిన తీరు పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని తెలిపారు. 

ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. కవిత చేసిన వ్యాఖ్యలతో కేసీఆర్ చాలా బాధపడ్డారని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలకు మనోధైర్యం ఇచ్చేందుకు ఆమెను సస్పెండ్ చేశారన్నారు. పార్టీకి నష్టం చేస్తే సొంత కుటుంబ సభ్యుల పైన కూడా చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. కవితకు ఎన్నిసార్లు చెప్పినా తన తీరు మార్చుకోలేదని.. పార్టీ కంటే ఎవరు ఎక్కువ కాదన్నారు. కవిత వెనుకుండి ఎవరో మాట్లాడిస్తున్నారని సందేహం వ్యక్తం చేశారు. 

Also Read: భారీ వరదలు.. కిలో టమోటా రూ.350.. ఉల్లి రూ.250 - ఎక్కడంటే?

కవిత తన గోతిని తానే తీసుకుందని గొంగిడి సునీత అన్నారు. కేసీఆర్‌ను గౌరవించినట్లు కవితను కూడా తెలంగాణ ప్రజలు గౌరవించారన్నారు. బీఆర్‌ఎస్ వల్లే కవితకు ఎంపీగా, ఎమ్మెల్సీగా పోటీ చేయడం కోసం బీఫాం ఇచ్చామని తెలిపారు. అది మర్చిపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్‌ తనకు నచ్చకపోవచ్చు.. కానీ తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ను కోరుకుంటున్నారని పేర్కొన్నారు. మజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ కూడా కేసీఆర్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ట్వీట్ చేశారు. 

హరీశ్‌ రావు, సంతోష్ రావుపై చేసిన వ్యాఖ్యలు బాధించాయని బీఆర్ఎస్‌ నాయకురాలు మాలోతు కవిత అన్నారు. పార్టీని నమ్ముకుని చాలామంది ఉన్నారని తెలిపారు. కవిత బీఆర్‌ఎస్‌ పార్టీ ఉంటే ఎంత ? పోతే ఎంత ? అని అనడం బాధేసిందని తెలిపారు. పేగుబంధం కన్నా పార్టీ బంధమే గొప్పదని కేసీఆర్‌ నిరూపించారన్నారు. 

కవితపై పార్టీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేయడంతోనే కేసీఆర్‌ ఆమెను సస్పెండ్ చేశారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరున్నా వాళ్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కవిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ ఉందని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చాలని కాంగ్రెస్ కుట్ర చేసిందని విమర్శించారు. కర్ణాటక, తమిళనాడులో కూడా కాంగ్రెస్ ఇలాంటి పనే చేసిందన్నారు. కవిత వాళ్ల మాటలకు లొంగిపోయిందని అసహనం వ్యక్తం చేశారు. 

Also Read: అయ్యో.. ఓనమ్ వేడుకల్లో విషాదం.. డాన్స్ చేస్తూ కుప్పకూలిన ఉద్యోగి!

గత కొంతకాలంగా పార్టీకి నష్టం కలిగించేలా కవిత ప్రవర్తిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. కేసీఆర్‌ తన కూతురు కంటే పార్టీ భవిష్యత్తే ముఖ్యమనే మెసేజ్‌ ఇచ్చారని పేర్కొన్నారు. కవిత చేస్తున్న ఆరోపణలను ఎవరూ కూడా నమ్మరని అన్నారు. కష్టసమయంలో పార్టీకి అండగా ఉండాల్సిన కవిత శత్రువులకు చేయూతనిస్తోందని తీవ్రంగా విమర్శలు చేశారు. అంతేకాదు కవిత ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమీ ఉండదని స్పష్టం చేశారు. 

Advertisment
తాజా కథనాలు