MLC Kavitha: BRS మీడియా, హరీష్ రావు మీడియా, సంతోష్ రావు మీడియా నన్నే టార్గెట్ చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆల్మట్టి విషయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన జలవనరు కృష్ణనది. దక్షిణ తెలంగాణలో ఉన్న ఐదు జిల్లాలు మహాబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ తదితర జిల్లాలకు ప్రాణదాయినిగా కృష్ణనది జలాలు ఉంటాయన్నారు. అలాంటి నదిపై కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచేందుకు సన్నాహాలు చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచితే తెలంగాణకు తీవ్రంగా నష్టం జరుగుతుందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచితే సీఎం రేవంత్ సొంత జిల్లాకు చుక్క నీరు కూడా రాదని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
దక్షిణ తెలంగాణ లోని ఐదు జిల్లాలకు కృష్ణానది వర ప్రదాయిని అని కవిత అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఆల్మట్టి హైట్ పెరగకుండా జీవో ఉందని ఆమె గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం 5 మీటర్ల ఎత్తు పెంచడానికి సిద్ధం అవుతుందన్నారు. దీనివల్ల తెలంగాణ కు కృష్ణానది ఆనవాళ్లు లేకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఉద్యమ సమయంలోనూ పోరాడినం. ముఖ్యంగా జలసాధన విషయంలోనే ఉద్యమాన్ని నిర్మించుకున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలోనూ నదీ జలాల పంపిణీ విషయంలో ఒప్పందాలున్నాయన్నారు.
ఒకవేళ ఆల్మంటి ఎత్తు పెంచితే మనకు చుక్క నీరు రాదని, అలా చేస్తే మన పొలాల్లో క్రికెట్ ఆడటానికి తప్ప దేనికి కూడా పనికి రావని కవిత అన్నారు. సీఎం సొంత జిల్లా పాలమూరు కు ఒక్క చుక్క నీరు రాకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ నే అని, సోనియాగాంధీతో సిద్ధ రామయ్య కు ఫోన్ చేయించి ఆల్మట్టి ఎత్తును.. వెంటనే ఆపండి అని సీఎం రేవంత్ ను కోరారు. ఆల్మట్టి విషయం లో ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టు కు వెళ్లాలని సూచించారు. మీరు ఆపకపోతే పాలమూరు పులిబిడ్డ నా…లేకుంటే పేపర్ పులి నా అని తేలిపోతుందని కవిత సెటైర్లు వేశారు. త్వరలో కృష్ణా ట్రిబ్యునల్ మీటింగ్ జరగ బోతుందన్నారు. ఆ మీటింగ్ కు సీఎం స్వయంగా వెళ్లి ఆల్మట్టి ఎత్తు ఆపే విధంగా పోరాటం చేయాలన్నారు.
కాగా రాజీనామా విషయమై ప్రశ్నించగా నా రాజీనామా ను స్పీకర్ ఫార్మాట్ లో చేశానన్నారు. ఫోన్ చేసి కూడా ఆమోదించమని అడిగానన్నారు. తెలంగాణ లో కొత్త రాజకీయ పార్టీలు వస్తే స్వాగతిస్తామన్నారు. ప్రజాస్వామ్యం లో ఎవరికైనా పార్టీ లు పెట్టుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు. నాకు బతుకమ్మ కోసం చాలా ఆహ్వానాలు వస్తున్నాయని తెలిపారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ రోజు మా స్వగ్రామం చింత మండక లో పాల్గొంటున్నానని వెల్లడించారు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసే అంశంపై ఇంకా ఏం ఆలోచించ లేదని కవిత తెలిపారు.
Also Read: టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద మాఫియా.. అల్లు అరవింద్ క్రెడిట్స్ కొట్టేస్తాడు: బండ్ల గణేష్
MLC Kavitha: బీఆర్‌ఎస్,హరీశ్,సంతోష్‌రావు మీడియా నన్ను టార్గెట్ చేస్తోంది.. కవిత సంచలన వ్యాఖ్యలు
BRS మీడియా, హరీష్ రావు మీడియా, సంతోష్ రావు మీడియా నన్నే టార్గెట్ చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచేందుకు సన్నాహాలు చేస్తోందన్నారు.
MLC Kavitha