'లిటిల్ హార్ట్స్' చిన్న బడ్జెట్ తో బ్లాక్ బస్టర్ విజయం సాధించిందని, ఈ విజయాన్ని చూసి పెద్ద దర్శకులు సిగ్గు తెచ్చుకోవాలని బండ్ల గణేష్ అన్నారు. కంటెంట్ ఉంటే సినిమా హిట్ అవుతుందన్న 'లిటిల్ హార్ట్స్' ప్రూవ్ చేసిందన్నారు.
Bandla Ganesh: చిన్న బడ్జెట్‌తో తెరకెక్కి, భారీ విజయాన్ని సాధించిన ‘లిటిల్ హార్ట్స్’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్(Little Hearts Success Meet) ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా అల్లు అరవింద్, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), బండ్ల గణేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
బండ్ల గణేష్ మాట్లాడుతూ, “ఈరోజుల్లో పెద్ద సినిమాలే హిట్టవుతాయనుకునే కాలంలో, కేవలం రెండున్నర కోట్ల బడ్జెట్‌తో తీసిన లిటిల్ హార్ట్స్ సినిమా, పెద్ద సినిమాలకు సవాల్ విసిరింది,” అన్నారు. "చిన్న సినిమా చచ్చిపోయిందనుకునే ఇండస్ట్రీకి 'లిటిల్ హార్ట్స్' ఒక బుద్ధి చెప్పే సినిమా" అని అన్నారు.
“ప్రముఖ దర్శకులు, నిర్మాతలు సహా మనందరం ఈ సినిమా విజయాన్ని చూసి తలవంచుకోవాలి. కథ బాగుంటే, మంచి కంటెంట్ ఉంటే, ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని 'లిటిల్ హార్ట్స్' నిరూపించింది” అని స్పష్టం చేశారు.
గణేష్ మాట్లాడుతూ, “ఇండస్ట్రీలో కొన్ని మాఫియా వ్యవస్థలు మనల్ని బ్రతకనివ్వవు. ఎవరో కొంత మంది బాగుంటారు. వాళ్లు జన్మల నుంచి ప్రివిలెజ్‌తో ఉంటారు. కానీ మిగతావాళ్లం కష్టపడి ఎదగాలి,” అన్నారు.
“ఒకరు స్టార్ కమెడియన్ కొడుకుగా పుడతాడు, ఇంకొకరు మెగాస్టార్ బావమరిదిగా ఉంటాడు. అలాంటి వాళ్లకి లైఫ్ ఈజీగా ఉంటుంది. మిగతా వాళ్లు మాత్రం తమ కష్టంతోనే ముందుకు రావాలి. అదే నిజమైన ప్రయాణం,” అన్నారు.
ఈ సినిమాలో హీరోగా నటించిన మౌళి తనూజ్ గురించి మాట్లాడుతూ, “ఇది సినిమా కాదు. ఇది నన్ను, నా నాన్నను గుర్తు చేసింది. సినిమాలోని తండ్రి కొడుకు మధ్య ఎమోషన్ నిజంగా అద్భుతంగా ఉంది. ఎవరైనా సరే రిలేట్ అవ్వగలిగేలా తీశారు,” అన్నారు. “నాకు ఏడు ఎనిమిదేళ్ల తర్వాత మళ్ళీ కిక్కు ఇచ్చిన చిత్రం 'లిటిల్ హార్ట్స్'. సినిమా చూసాక వెంటనే ఫంక్షన్‌కు రావాలనిపించింది,” అన్నారు.
“ఈ విజయంతో ఊగిపోవద్దు. ఇది ఒక కల, ఒక 3డి ఫీలింగ్ లా భావించు. నిజ జీవితంలో ఎలా ఉన్నావో అదేలా కొనసాగాలి,” అన్నారు. బండ్ల గణేష్ మాట్లాడుతూ, "ఈ సినిమాలో పెట్టిన రెండున్నర కోట్లు, ఒక పెద్ద సినిమాకు మూడు రోజుల షూటింగ్ క్యాన్సిల్ అయితేనే ఖర్చవుతుంది. అలాంటిది, ఇదే బడ్జెట్‌తో, 50 కోట్ల వరకూ వసూలు చేయడం చాలా గొప్ప విషయం" అని అన్నారు.
“మనకు 1000 కోట్ల బడ్జెట్ సినిమాలు అవసరం లేదు. ప్రతి నెలా ఒక మంచి కథతో రూపొందిన చిన్న సినిమా వస్తే చాలు. ఇండస్ట్రీ చాలా కాలం బాగుంటుంది. 'లిటిల్ హార్ట్స్' ఒక మంచి మార్గాన్ని చూపించింది,” అన్నారు.
'‘లిటిల్ హార్ట్స్’ సినిమా అందించిన విజయంతో చిన్న సినిమాల పట్ల ఉన్న నెగటివ్ అభిప్రాయాలను చెరిపేసింది. బడ్జెట్ కాదు, కథే కీలకం అని మరోసారి నిరూపించింది. మరి బండ్ల గణేష్ వ్యాఖ్యలపై మీరేమంటారు..?
Bandla Ganesh: టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద మాఫియా.. అల్లు అరవింద్ క్రెడిట్స్ కొట్టేస్తాడు: బండ్ల గణేష్
'లిటిల్ హార్ట్స్' చిన్న బడ్జెట్ తో బ్లాక్ బస్టర్ విజయం సాధించిందని, ఈ విజయాన్ని చూసి పెద్ద దర్శకులు సిగ్గు తెచ్చుకోవాలని బండ్ల గణేష్ అన్నారు. కంటెంట్ ఉంటే సినిమా హిట్ అవుతుందన్న 'లిటిల్ హార్ట్స్' ప్రూవ్ చేసిందన్నారు.
Bandla Ganesh
Bandla Ganesh: చిన్న బడ్జెట్‌తో తెరకెక్కి, భారీ విజయాన్ని సాధించిన ‘లిటిల్ హార్ట్స్’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్(Little Hearts Success Meet) ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా అల్లు అరవింద్, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), బండ్ల గణేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read: దుమ్మురేపుతున్న 'OG' సెన్సార్ టాక్.. ఊచకోతేనట..!
బండ్ల గణేష్ మాట్లాడుతూ, “ఈరోజుల్లో పెద్ద సినిమాలే హిట్టవుతాయనుకునే కాలంలో, కేవలం రెండున్నర కోట్ల బడ్జెట్‌తో తీసిన లిటిల్ హార్ట్స్ సినిమా, పెద్ద సినిమాలకు సవాల్ విసిరింది,” అన్నారు. "చిన్న సినిమా చచ్చిపోయిందనుకునే ఇండస్ట్రీకి 'లిటిల్ హార్ట్స్' ఒక బుద్ధి చెప్పే సినిమా" అని అన్నారు.
“ప్రముఖ దర్శకులు, నిర్మాతలు సహా మనందరం ఈ సినిమా విజయాన్ని చూసి తలవంచుకోవాలి. కథ బాగుంటే, మంచి కంటెంట్ ఉంటే, ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని 'లిటిల్ హార్ట్స్' నిరూపించింది” అని స్పష్టం చేశారు.
Also Read: డార్లింగ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్.. 'ఫౌజీ' లో మరో స్టార్ హీరో ఎంట్రీ!
ఇండస్ట్రీ మాఫియా..
గణేష్ మాట్లాడుతూ, “ఇండస్ట్రీలో కొన్ని మాఫియా వ్యవస్థలు మనల్ని బ్రతకనివ్వవు. ఎవరో కొంత మంది బాగుంటారు. వాళ్లు జన్మల నుంచి ప్రివిలెజ్‌తో ఉంటారు. కానీ మిగతావాళ్లం కష్టపడి ఎదగాలి,” అన్నారు.
“ఒకరు స్టార్ కమెడియన్ కొడుకుగా పుడతాడు, ఇంకొకరు మెగాస్టార్ బావమరిదిగా ఉంటాడు. అలాంటి వాళ్లకి లైఫ్ ఈజీగా ఉంటుంది. మిగతా వాళ్లు మాత్రం తమ కష్టంతోనే ముందుకు రావాలి. అదే నిజమైన ప్రయాణం,” అన్నారు.
Also Read: Shanmukh Jaswanth: 'ప్రేమకు నమస్కారం' అంటున్న షణ్ముఖ్.. కొత్త సినిమా గ్లింప్స్ అదిరింది బ్రో !
మౌళి, 'లిటిల్ హార్ట్స్' టీంపై ప్రశంసలు
ఈ సినిమాలో హీరోగా నటించిన మౌళి తనూజ్ గురించి మాట్లాడుతూ, “ఇది సినిమా కాదు. ఇది నన్ను, నా నాన్నను గుర్తు చేసింది. సినిమాలోని తండ్రి కొడుకు మధ్య ఎమోషన్ నిజంగా అద్భుతంగా ఉంది. ఎవరైనా సరే రిలేట్ అవ్వగలిగేలా తీశారు,” అన్నారు. “నాకు ఏడు ఎనిమిదేళ్ల తర్వాత మళ్ళీ కిక్కు ఇచ్చిన చిత్రం 'లిటిల్ హార్ట్స్'. సినిమా చూసాక వెంటనే ఫంక్షన్‌కు రావాలనిపించింది,” అన్నారు.
“ఈ విజయంతో ఊగిపోవద్దు. ఇది ఒక కల, ఒక 3డి ఫీలింగ్ లా భావించు. నిజ జీవితంలో ఎలా ఉన్నావో అదేలా కొనసాగాలి,” అన్నారు. బండ్ల గణేష్ మాట్లాడుతూ, "ఈ సినిమాలో పెట్టిన రెండున్నర కోట్లు, ఒక పెద్ద సినిమాకు మూడు రోజుల షూటింగ్ క్యాన్సిల్ అయితేనే ఖర్చవుతుంది. అలాంటిది, ఇదే బడ్జెట్‌తో, 50 కోట్ల వరకూ వసూలు చేయడం చాలా గొప్ప విషయం" అని అన్నారు.
Also Read:'ము.. ము.. ముద్దంటే చేదా..?’ ఇంట్రెస్టింగ్ గా 'కిస్' ట్రైలర్..