VIRAL VIDEO: మల్లారెడ్డా మజాకా.. బజాజ్ చేతక్‌పై పాల డబ్బాలతో రయ్ రయ్!

బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి స్కూటర్ పై పాలు అమ్ముతూ మరోసారి సందడి చేశారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో ఓ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ పాల డబ్బాతో కనిపించిన స్కూటర్ పై ఎక్కి కూర్చొన్నారు. అనంతరం చకచకా ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ వీడియో వైరల్ అవుతోంది.

New Update
BRS former minister malla reddy Selling milk on scooter

BRS former minister malla reddy Selling milk on scooter

పాలు అమ్మినా.. పూలు అమ్మినా.. కష్టపడ్డా.. సక్సెస్ అయ్యా.. ఈ డైలాగ్ వింటే ముందుగా గుర్తొచ్చేది బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి. ఈ డైలాగ్ వింటే ఎవ్వరైనా టక్కున గుర్తుపట్టేస్తారు. సినిమాల్లో బాలయ్య బాబు డైలాగ్‌కు ఎంతటి క్రేజ్ ఉంటుందో.. పాలిటిక్స్‌లో మల్లారెడ్డి డైలాగ్‌కు అంత క్రేజ్. 

Also Read :  Gold Prices: ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం ధర.. ఇదే గోల్డెన్‌ ఛాన్స్‌!

ఆయన పాల్గొన్న ఎన్నో ఈవెంట్లలో తన డైలాగ్ వినిపిస్తూనే వచ్చాడు మల్లారెడ్డి. అలా అది బాగా వైరల్ కావడమే కాకుండా.. ఫేమస్ అయిపోయింది. అయితే తాజాగా అతడు మళ్లీ తన పాత రోజులను గుర్తు చేసుకున్నాడు. ఈసారి మాటల రూపంలో కాదు.. ఏకంగా చేతల రూపంలోనే చూపించాడు.

Also read : Aashiqui 3: బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. టీజర్ అదిరింది! చూశారా 

పాల బండిపై మల్లారెడ్డి

ఆయన ఓ పాల బండిపై తాజాగా కనిపించారు. ఇవాళ (ఆదివారం) మేడ్చల్ జిల్లాలోని బోడుప్పల్‌లో ఆయన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడే తనకు ఓ పాల డబ్బాలతో స్కూటర్ కనిపించింది. దీంతో తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. ఆ స్కూటర్‌పై ఎక్కి కూర్చున్నారు. 

Also Read : Health: నెలరోజులు క్రమం తప్పకుండ ఈ పండు తింటే...బరువు పెరగరు!

ఆ పాల బండిని చూస్తే తాను పాలు అమ్మిన రోజులను గుర్తు చేసుకున్నట్లు అర్థం అవుతుంది. దీంతో దానిపై కూర్చొని చకచకా ఫొటోలను పోజులిచ్చారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఆ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు. మళ్ళీ పాలు అమ్ముతున్నావా? మల్లారెడ్డి అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు