/rtv/media/media_files/2025/02/09/N29MH7Y3ssaXaLEtXnEv.jpg)
gold
బంగారం కొనాలనుకుంటున్న వారికి ఇదే మంచి ఛాన్స్. ఇటీవల భారీగా పెరిగిన పుత్తడి ధరలు ఒక్కసారిగా తగ్గాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో సడెన్‌గా భారీ మార్పు రావడంతో దేశీయంగా ఆ ప్రభావం కనపడింది. అమెరికాలో జనవరి ద్రవ్యోల్బణం మరోసారి పెరిగిన క్రమంలో రిటైల్ సేల్స్ పడిపోతున్నాయి. దీంతో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు సన్నగిల్లాయి. ఈ క్రమంలో బంగారం ధరలు సడెన్‌గా దిగొచ్చాయి.
ఆల్ టైమ్ గరిష్ఠాలకు చేరుకున్న బంగారం ధరలతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. దీంతో బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లలో కనిపించింది. క్రితం రోజుతో పోలిస్తే ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. పసడి కొనుగోలుగు ఇదే మంచి అవకాశంగా చెప్పవచ్చు.
ఇంటర్నేషనల్ బులియన్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఒక ఔన్సు (31.10 గ్రాములు)కు దాదాపు అరవై డాలర్ల వరకు దిగివచ్చింది. ప్రస్తుతం 2882 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు 32.17 డాలర్లకు దిగివచ్చింది. రిజర్వ్ బ్యాంక్ చర్యలతో రూపాయి విలువ క్రమంగా పుంజుకుంటోంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే మన దేశ కరెన్సీ మారకం విలువ రూ.86.76 వద్ద ట్రేడవుతోంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ముందు రోజుతో పోలిస్తే కొంచెం తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 100 వరకు తగ్గింది. దీంతో తులం ధర రూ. 78 వేల 900 వద్దకు దిగివచ్చింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ. 109 మేర తగ్గింది. దీంతో తులం రేటు రూ. 86,070 వద్దకు దిగివచ్చింది.
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు దిగివచ్చినప్పటికీ వెండి రేటు రికార్డ్ స్థాయి వద్దే స్థిరంగా కొనసాగుతోంది. అంతకు ముందు రోజు కిలో వెండి రూ.1000 మేర పెరిగి రూ.1,08,000 వద్దకు చేరింది. ఇవాళ అదే రేటు వద్ద అమ్ముడవుతోంది.