Sreeleela Bollywood debut
Sreeleela Bollywood debut: యంగ్ బ్యూటీ శ్రీలీల బాలీవుడ్ అరంగేట్రం చేసేందుకు సిద్దమవుతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ తో నటించనున్నట్లు పుకార్లు వచ్చాయి. ఈ క్రమంలో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీపై అధికారిక ప్రకటన వెలువడింది. తాజాగా శ్రీలీల- కార్తిక్ ఆర్యన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ టీజర్ ను విడుదల చేశారు. అయితే సినిమా టైటిల్ ఏంటి? అనేది ఇంకా రివీల్ చేయలేదు.
This Diwali ❤️🔥https://t.co/jVhvc929AZ#BhushanKumar @TheAaryanKartik @sreeleela14 @basuanurag @ipritamofficial #TaniBasu @ShivChanana @neerajkalyan_24 pic.twitter.com/w4rO2wbleO
— T-Series (@TSeries) February 15, 2025
ఆషికి 3
కానీ.. టీజర్ లో కనిపించే స్టోరీ చూస్తుంటే.. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ 'ఆషికి2' సీక్వెల్ ఈ చిత్రం రాబోతున్నట్లు తెలుస్తోంది. 1990లో విడుదలైన ఆషికి ఫస్ట్ పార్ట్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత 2013లో 'ఆషికి 2' వచ్చింది. ఇది దాదాపు రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించడంతో పాటు.. ఆ ఏడాది బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ గా కూడా నిలిచింది. ఇప్పుడు దీని సీక్వెల్ గా రాబోతున్న 'ఆషికి 3' తో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం ఫ్యాన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Also Read: Chhaava Day 2 Collections: రెండు రోజుల్లోనే 100 కోట్ల దిశగా.. 'చావా' బాక్సాఫీస్ సంచలనం
'పెళ్లి సందడి' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన యంగ్ బ్యూటీ శ్రీలీల.. కెరీర్ తొలినాళ్లలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. హిట్టు, ప్లాప్ పక్కన పెడితే వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తోంది. అతితక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఇక ఇటీవలే 'పుష్ప2'లో 'కిస్సిక్' పాటతో ఈ అమ్మడు పాన్ ఇండియా లెవెల్ కి వెళ్ళింది. దీంతో బాలీవుడ్ ఆఫర్లు కూడా తలుపు తడుతున్నాయి.
Also Read: Malayalam Film Industry: మలయాళం ఇండస్ట్రీలో అన్నీ బంద్.. జూన్ 1 నుంచి ఏం జరగబోతుందంటే