KCR : కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు

సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ నాయకులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల కనీస గౌరవ మర్యాద లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు.

New Update
BRS complaint against Revanth Reddy

BRS complaint against Revanth Reddy

 KCR : సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల కనీస గౌరవ మర్యాద లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ఫిర్యాదు చేశారు.మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ పట్ల కనీస గౌరవ మర్యాదలు లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌ను ఉద్దేశించి.. మాట్లాడుతూ.. ‘మీకు మీరే స్టేచర్‌ ఉందని ఫీలైతే.. స్ట్రేచర్‌ మీదకు పంపించారు.. ఇట్లనే చేస్తే ఆ తర్వాత మార్చురీకి పోతారు.’ అంటూ అవహేళనగా దూషించారు. రేవంత్‌ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలను పలువురు నెటిజన్లు తీవ్రంగా ఖండించారు.

Also Read: వీడేం మనిషండీ బాబు.. పొరుగింటి వారితో గొడవ.. కారుతో ఢీకొట్టడంతో తలకిందులుగా వేలాడిన మహిళ!


ఈనెల 12వ తేదీన రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో ప్రసంగిస్తూ  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ‘స్టాచర్ నుంచి స్ట్రైచర్’కు వెళ్లారని రేపు ‘స్ట్రైచర్ నుంచి మార్చురీకి’వెళ్తారని పేర్కొన్నారని, ఈ తరహా ప్రసంగం తెలంగాణ సమాజంలో గొడవలకు దారి తీసే విధంగా ఉందని పేర్కొన్నారు. ఇలా రెచ్చగొట్టే ప్రసంగం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తక్షణమే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

Also read; JD Vance: అమెరికా పౌరసత్వంపై జేడీ వాన్స్ సంచలన కామెంట్స్

మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జూనియర్ లెక్చరర్లకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సందర్భంగా... కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్లు స్ట్రేచర్ ఉందని విర్రవీగారు..కానీ స్ట్రెచర్‌పై పడ్డారనీ... ఇకనైనా వైఖరి మార్చుకోవాలన్నారు. బాధ్యాతాయుత ప్రతిపక్షంగా వ్యవహరించాలన్నారు. లేకపోతే స్ట్రెచర్ నుంచి మార్చురీలోకి వెళ్లడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. తమ నేత చావును సీఎం రేవంత్ కోరుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also read: Jana Sena: జనసేనతో పవనన్న ప్రయాణం ఇదే.. ఒక్కడిగా మొదలై

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు