JD Vance: అమెరికా పౌరసత్వంపై జేడీ వాన్స్ సంచలన కామెంట్స్

గ్రీన్ కార్డు ఉన్నవరందరూ అమెరికాలో శాస్వత నివాసులు కాదని ఆ దేశ ఉపాధ్యాక్షుడు జేడీ వాన్స్ అన్నారు. అమెరికా పౌరసత్వం అనేది దేశ భద్రతకు సంబంధించిందని చెప్పారు. ఇమిగ్రేషన్‌ రూల్స్ పాటించకపోతే వెంటనే వారిని అమెరికా నుంచి పంపిస్తామని మీడియాతో చెప్పారు ఆయన.

New Update
jd

అమెరికా పౌరసత్వంపై ఆ దేశ ఉపాధ్యాక్షుడు జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్ సిటిజన్స్‌కు ఇచ్చే గుర్తింపు గ్రీన్‌ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వత నివాసులు కాలేరని ఆయన అన్నారు. పౌరసత్వం అనే వాక్ స్వేచ్ఛ గురించి కాదని.. అది జాతీయ భద్రత గురించి ఆలోచించే విషయమని అన్నారు. గ్రీన్‌ కార్డు ఉంటే యూఎస్‌లో ఉండటానికి నిరవధిక హక్కు ఉన్నట్లు కాదని వ్యాఖ్యానించిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌. నేరాలకు పాల్పడటం, సుదీర్ఘ కాలం దేశాన్ని వీడటం, ఇమిగ్రేషన్‌ నిబంధనలను పాటించకపోతే గ్రీన్‌కార్డును రద్దు చేయొచ్చని అమెరికా చట్టాలు చెబుతున్నాయి. వ్యాపారులకు ఇచ్చే గోల్డ్ కార్డ్ గురించి కూడా ఆయన మాట్లాడారు. అమెరికా గోల్డ్ కార్డ్ పొందాలంటే విదేశీ పౌరులు 5 మిలియన్ల డాలర్లు(రూ.43 కోట్ల 46 లక్షలు) చెల్లించి అమెరికాలో నివసించే, పని చేసే హక్కును కల్పిస్తారని తెలిపారు. అమెరికా సమాజంలోకి ఎవరిని చేర్చుకోవాలో అమెరికన్లే నిర్ణయిస్తారని ఆయన స్పష్టం చేశారు. 

Also read: Jana Sena: జనసేనతో పవనన్న ప్రయాణం ఇదే.. ఒక్కడిగా మొదలై

శాస్వతంగా ఆ దేశంలో ఉంటేనే అమెరికా ఆఫర్లు ఇస్తోందని అన్నారు. ఒక వ్యక్తి భారతదేశం, చైనా, జపాన్ మరియు ఇతర దేశాల నుండి వచ్చి హార్వర్డ్ లేదా వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్‌లో చదువుతుంటే... వారికి ఉద్యోగ ఆఫర్లు అందుతాయి. కానీ ఆ వ్యక్తి దేశంలో ఉండగలరా లేదా అనే దానిపై ఎటువంటి ఖచ్చితత్వం లేనందున ఆఫర్ వెంటనే రద్దు చేయబడుతుందని జేడీ వాన్స్ అన్నారు. విదేశీ పెట్టుబడిదారులు గ్రీన్ కార్డ్‌కు అర్హత సాధించడానికి USలో ఉద్యోగాలను సృష్టించాలి. US సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్  నుండి వచ్చిన ఇటీవలి డేటా ప్రకారం, US వర్క్ వీసాలు తీసుకుంటున్న వారిలో ఇండియన్స్ ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అక్టోబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2023 మధ్య జారీ చేయబడిన మొత్తం H1B వీసాలలో 72.3 శాతం భారతీయులే ఉన్నారట. 

Also read: Aamir Khan: 60ఏళ్ల వయసులోనూ బాలీవుడ్ హీరో డేటింగ్.. ఎవరీ గౌరీ స్ప్రాట్‌?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు