Telangana: సిట్‌ విచారణకు కేసీఆర్‌.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ ఆందోళనలు

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ఫిబ్రవరి 1న సిట్ అధికారులు విచారించనున్నారు. దీంతో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపట్టాలని తమ పార్టీ కార్యకర్తలకు బీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది.

New Update
KCR

KCR

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ఫిబ్రవరి 1న సిట్ అధికారులు విచారించనున్నారు. దీంతో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపట్టాలని తమ పార్టీ కార్యకర్తలకు బీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది. రేవంత్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్‌ను వేధిస్తోందని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్యాపింగ్‌ పేరుతో కట్టుకథలు సృష్టించి, సిట్‌ విచారణ పేరుతో నోటీసులు జారీ చేయడం దుర్మార్గం అంటున్నారు. రేపు నిరసనల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 12 వేలకు పైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు నిర్వహించాలంటూ పిలుపునిచ్చారు. 

Also Read: బడ్జెట్ తయారీ ముందు అల్వా వేడుక.. అసలు కారణం ఇదే!

ప్రతి మున్సిపల్, నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, నల్ల జెండాలతో ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాలన్నారు. నిరసనలు శాంతియుతంగా జరగాలని పోలీసులతో ఘర్షణలు జరగకుండా ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించాలని కోరారు. పార్టీ కార్యకర్తలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్నిచోట్ల నిరసనలు చేపట్టాలన్నారు. ఆవేశాలకు గురికావొద్దని.. జిల్లాల్లో ఉన్న నేతలు అక్కడే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 

Also Read: బలూచిస్తాన్‌లో రక్తపాతం: పాక్ ఆర్మీపై విరుచుకుపడ్డ BLA.. 47 మంది మృతి!

ఇక హైదరాబాద్‌లో అందుబాటులో ఉండే నేతలు తెలంగాణ భవన్‌కు చేరుకోవాలని సూచించారు. మరోవైపు కేసీఆర్‌ సిట్ విచారణ దృష్ట్యా తెలంగాణ భవన్‌లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ శ్రేణులు అక్కడికి పెద్ద సంఖ్యలో తరలివచ్చే ఛాన్స్ ఉన్నందున దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. కేసీఆర్‌ను సిట్‌ విచారణ చేయనుండటంతో ఆదివారం ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటాయో అనేదానిపై ఆసక్తి నెలకొంది. 

Advertisment
తాజా కథనాలు