Union Budget 2026-27: బడ్జెట్ తయారీ ముందు హల్వా వేడుక.. అసలు కారణం ఇదే!

భారతదేశంలో ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు 'నోరు తీపి చేసుకోవడం' ఆచారం. కేంద్ర బడ్జెట్ తయారీలోనే అదే సంప్రదాయాన్ని పాటిస్తారు. బడ్జెట్ తయారీ తుది దశకు చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ వేడుకను నిర్వహిస్తుంది.

author-image
By K Mohan
New Update
nirmala sitharaman halwa ceremony

Union Budget 2026-27: భారతదేశంలో ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు 'నోరు తీపి చేసుకోవడం' ఆచారం. కేంద్ర బడ్జెట్ తయారీలోనే అదే సంప్రదాయాన్ని పాటిస్తారు. బడ్జెట్ తయారీ తుది దశకు చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ వేడుకను నిర్వహిస్తుంది. సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి 10 రోజుల ముందు న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్ (ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం)లోని బేస్‌మెంట్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆర్థిక మంత్రి స్వయంగా హల్వాను వడ్డించి ఈ వేడుకను ప్రారంభిస్తారు.

Also Read: రేపే బడ్జెట్.. గ్యాస్, సిగరేట్స్ నుంచి ఫాస్టాగ్ వరకు.. రేపటి నుంచి ఈ ధరల్లో మార్పు?

ఈ వేడుక వెనుక ఉన్న అసలు కారణం: 'గోప్యత'

హల్వా వేడుక ముగిసిన వెంటనే బడ్జెట్ తయారీలో పాల్గొనే దాదాపు 100 మందికి పైగా అధికారులు, సిబ్బంది బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకుంటారు. దీనినే 'లాక్-ఇన్' టైం అంటారు. బడ్జెట్ వివరాలు బయటకు పొక్కకుండా ఉండేందుకు ఈ అధికారులందరూ నార్త్ బ్లాక్‌లోని బేస్‌మెంట్‌లోనే ఉంటారు. వారు తమ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడటానికి వీలుండదు. ఫోన్ కాల్స్, ఇంటర్నెట్ సౌకర్యం ఉండదు. కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతి ఉంటుంది. బడ్జెట్ ప్రసంగం ముగిసే వరకు (ఫిబ్రవరి 1) వీరు అక్కడే ఉండి బడ్జెట్ ప్రతులను ముద్రించడం, ఇతర పనులను పర్యవేక్షిస్తారు. గతంలో బడ్జెట్ ప్రతులను భారీగా ముద్రించేవారు. కానీ, 2021 నుండి కేంద్ర ప్రభుత్వం 'డిజిటల్ బడ్జెట్' ప్రవేశపెట్టింది. అయినప్పటికీ, హల్వా వేడుకను ఒక సంప్రదాయంగా ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. దేశ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే బడ్జెట్ వెనుక ఎంతటి కఠిన శ్రమ, గోప్యత ఉంటాయో ఈ హల్వా వేడుక మనకు గుర్తు చేస్తుంది.

Advertisment
తాజా కథనాలు